Indian Tech Startup : భారత టెక్ స్టార్టప్ హెల్తిఫైమిలో 150 మంది ఉద్యోగులు తొలగింపు

భారత టెక్ స్టార్టప్ హెల్తిఫైమిలో 150 మంది ఉద్యోగులను తొలగించారు. మ్యాటర్ ఎక్స్ పర్ట్స్, క్వాలిటీ అనలిటిక్స్, ప్రోడక్ట్, మార్కెటింగ్ విభాగాల్లోని పలువురు ఉద్యోగులపై వేటు పడింది. హెల్తిఫైమి 2.0పై వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని లేఆఫ్స్ ను ధృవీకరిస్తూ కంపెనీ పేర్కొంది.

Indian Tech Startup : భారత టెక్ స్టార్టప్ హెల్తిఫైమిలో 150 మంది ఉద్యోగులు తొలగింపు

Indian tech startup

Indian Tech Startup : భారత టెక్ స్టార్టప్ హెల్తిఫైమిలో 150 మంది ఉద్యోగులను తొలగించారు. మ్యాటర్ ఎక్స్ పర్ట్స్, క్వాలిటీ అనలిటిక్స్, ప్రోడక్ట్, మార్కెటింగ్ విభాగాల్లోని పలువురు ఉద్యోగులపై వేటు పడింది. హెల్తిఫైమి 2.0పై వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని లేఆఫ్స్ ను ధృవీకరిస్తూ కంపెనీ పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా అనిశ్చితి వావతారణ నెలకొనడంతో హెల్తిఫైమి సైతం కొన్ని రోజులుగా ఉద్యోగులను తొలగిస్తున్న స్టార్టప్, టెక్ దిగ్గజాల సరసన చేరింది.

ఇటీవలే దేశీ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ జోష్ పేరెంట్ కంపెనీ వెర్ సీ కూడా 150 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కాగా, అంచనాలు, హైరింగ్ కు అనుగుణంగా వృద్ది నమోదు కాకపోవడంతో 150 మంది టీమ్ సభ్యులను తొలగించాల్సి వచ్చిందని హెల్తిఫైమి ప్రతినిధి స్పష్టం చేశారు.

Amazon Lays Off Employees: అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ.. ఇంటిబాట పట్టనున్న 10వేల మంది..!

ఎక్స్ గ్రేషియా ప్యాకేజీలో భాగంగా తొలగించిన ఉద్యోగులకు రెండు నెలల వేతనం అందిస్తామని కంపెనీ ప్రకటించింది. కౌన్సెలింగ్, అవుట్ ప్లేస్ మెంట్ సపోర్ట్ కూడా అందిస్తామని తెలిపింది. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ 2023 వరకు వర్తింపజేస్తామని పేర్కొంది.