Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా

ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ 40వ ఎత్తులో వేసిన పొరబాటును అందిపుచ్చుకున్న ప్రజ్ఞానంద..విజయం సాధించాడు. దీంతో నాకౌట్ దశకు వెళ్లే అవకాశాలను ప్రజ్ఞానంద సజీవంగా ఉంచుకున్నాడు.

Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా

Pragna

Praggnanandhaa: ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్, 16 ఏళ్ల ప్రజ్ఞానందా రమేష్‌బాబు మరోసారి చరిత్ర సృష్టించారు. శుక్రవారం జరిగిన ఉత్కంఠ భరిత ఆన్ లైన్ చెస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ వన్, నార్వే ఆటగాడు 31 ఏళ్ల మాగ్నస్ కార్ల్‌సన్‌ పై ప్రజ్ఞానందా విజయం సాధించాడు. చెస్‌బుల్ మాస్టర్స్ ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ యొక్క 5వ రౌండ్‌లో ఇద్దరు ఆటగాళ్లు తలపడ్డారు. ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ 40వ ఎత్తులో వేసిన పొరబాటును అందిపుచ్చుకున్న ప్రజ్ఞానంద..విజయం సాధించాడు. దీంతో నాకౌట్ దశకు వెళ్లే అవకాశాలను ప్రజ్ఞానంద సజీవంగా ఉంచుకున్నాడు. ఇరువురికి జరిగిన 5వ రౌండ్ మ్యాచ్ లో ఒకానొక దశలో మాగ్నస్ ఆట డ్రాగా ముగుస్తుందని భావించినా..40వ ఎత్తులో అతను చేసిన అతిపెద్ద తప్పుతో చివరకు ఆటను సమర్పించుకోవాల్సి వచ్చింది.

మాగ్నస్ తన 40వ ఎత్తులో గుర్రాన్ని జరిపిన అనంతరం..ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రజ్ఞానంద..ఏనుగును కదిలించడంతో..తన తప్పును గ్రహించిన మాగ్నస్ వెంటనే ఆట ముగిస్తూ సంతకం చేశాడు. దీంతో విజయాన్ని అందుకున్నాడు 16 ఏళ్ల ప్రజ్ఞానందా. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ‘ఎయిర్ థింగ్స్ మాస్టర్స్’ ఆన్ లైన్ మ్యాచ్ లో, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా మొదటిసారి మాగ్నస్ కార్ల్‌సన్‌ పై విజయం సాధించాడు. తన విజయంపై స్పందించిన ప్రజ్ఞానంద..”ఇక ఇప్పుడు మంచం ఎక్కి ప్రశాంతంగా నిద్ర పోవాలి” అని అన్నాడు.

Other Stories:Soldier Honey-Trap: హనీట్రాప్‌లో సైనికుడు.. పాక్ యువతికి రహస్య సమాచారం చేరవేత

అయితే ఆట మధ్యలో 3 పాయింట్లు కోల్పోయిన ప్రజ్ఞానంద..తనపై తానే కొంత అసహనానికి గురైయ్యానని చెప్పాడు. ఇక ప్రపంచ నెంబర్ వన్ అయిన మాగ్నస్ కార్ల్‌సన్‌ పై 16 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా విజయం సాధించడంపై భారతీయులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్ పై గెలవడం ఇతనికి ‘బాగా అలవాటైంది’ అంటూ ఒకరు కామెంట్ చేయగా..మరోసారి ‘ఏసేశాడు” అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం 11వ తరగతి పరీక్షలు రాస్తున్న అవుతున్న లిటిల్ మాస్టర్ ప్రజ్ఞానంద..ఓ వైపు పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే..ఆన్ లైన్ ద్వారా ఈ చెస్ గేమ్ ఆడాడు.

Other Stories: Virender Sehwag: అతను తిరిగొస్తే టెస్ట్ క్రికెట్‌కు ఎగ్జైట్మెంట్ వస్తుంది – వీరేంద్ర సెహ్వాగ్