Priyanka Mohite: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ

ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాలపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ప్రియాంక మరోమారు ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వతం "కాంచన్‌జంగా"ను అధిరోహించి చరిత్ర సృష్టించింది ప్రియాంక

Priyanka Mohite: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ

Priyanka

Priyanka Mohite: మహిళలు నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అవకాశం కోసం ఎదురు చూడకుండా కొత్త అవకాశాలను సృష్టించుకుని మరీ గెలుపు బావుటా ఎగురవేస్తున్నారు మహిళలు. చిన్న వయసులోనే పర్వతారోహణలో రికార్డులు నమోదు చేసిన ప్రియాంక మోహితే మరోసారి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాలపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ప్రియాంక మరోమారు ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ప్రపంచంలోనే మూడో ఎత్తైన పర్వతం “కాంచన్‌జంగా”ను అధిరోహించి చరిత్ర సృష్టించింది ప్రియాంక. పశ్చిమ మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) గురువారం కాంచన్‌జంగా పర్వతాన్ని అధిరోహించిది. దీంతో 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న ఐదు శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా ప్రియాంక చరిత్ర సృష్టించారు. మౌంట్ కాంచన్‌జంగా ఎత్తు 8,586 మీటర్లు. 2020లో టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు అందుకున్న ప్రియాంక మోహితే ఏప్రిల్ 2021లో ప్రపంచంలోని 10వ ఎత్తైన పర్వత శిఖరం అన్నపూర్ణ పర్వతాన్ని (8,091 మీ) అధిరోహించింది.

Also read:Online Delivery: ఆన్‌లైన్‌లో కాఫీ ఆర్డర్ చేసిన కస్టమర్: డెలివరీ బాయ్ చేసిన పనికి షాక్

ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళా అధిరోహకురాలు కూడా ప్రియాంకనే. ఇక 2013లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని (8,849 మీ), 2018లో మౌంట్ ల్హోట్సే (8,516 మీ), 2016లో మౌంట్ మకాలు (8,485 మీ), మౌంట్ కిలిమంజారో (5,895 మీ) కూడా అధిరోహించింది. చిన్నతనం నుంచే పర్వతారోహణపై మక్కువ పెంచుకున్న ప్రియాంక..యుక్తవయసులో మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతశ్రేణులను ఎన్నో సార్లు సందర్శించింది. 2012లో బందర్‌పంచ్, 2015మౌంట్ మెంతోసా పర్వతాలను కూడా ప్రియాంక అధిరోహించింది.

Also read:Covid Deaths: భారత్‌లోనే కరోనా మరణాలు ఎక్కువన్న డబ్ల్యూ.హెచ్.ఓ: కొట్టిపారేసిన కేంద్రం