ఏలియన్స్ పనేనా? : భారత్‌లో ప్రత్యక్షమైన ఫస్ట్ మిస్టరీ ‘మోనోలిత్’.. అదెక్కడో తెలుసా?

ఏలియన్స్ పనేనా? : భారత్‌లో ప్రత్యక్షమైన ఫస్ట్ మిస్టరీ ‘మోనోలిత్’.. అదెక్కడో తెలుసా?

India’s 1st Monolith Appears With Mysterious Message : 2020లో చాలా వింతలు జరిగాయి.. మహమ్మారులు విజృంభించాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలల నుంచి మిస్టరీ మోనోలిత్ ఏకశిలలు ప్రత్యక్షమవుతున్నాయి. చూస్తుంటే.. గ్రహాంతర వాసుల పనేనా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ మోనోలిత్ మిస్టరీ ఏకశిలలకు ఏలియన్స్ కు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉన్నట్టుండి ఎలా ఈ మోనోలిత్ పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు.


ఇప్పుడు భారతదేశంలో కూడా మిస్టరీ మోనోలిత్ ఏకశిల ప్రత్యక్షమైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని నెలల నుంచి మిస్టరీ మోనోలిత్ ఏకశిల (రాయి) కనిపిస్తున్నాయి. సీక్రెట్ మెసేజ్‌తో కూడిన మోనోలిత్ ఏకశిల ఒకటి ఫస్ట్ టైం ఇండియాలోనూ కనిపించింది. అదేక్కడో తెలుసా? గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో.. రాత్రికి రాత్రే కనిపించిన ఈ మోలోలిత్ ఏకశిల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 నగరాల్లో మోనోలిత్‌ ఏకశిల కనిపించింది. ఇప్పుడు మన దేశంలో ప్రత్యక్షం కావడంతో ఏంటి ఈ మిస్టరీ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అహ్మదాబాద్‌లోని తల్తేజ్‌లోని సింఫనీ ఫారెస్ట్ పార్క్‌లో ఈ మోనోలిత్ ఏకశిల నిర్మాణం కనిపించింది. ఇతర నిర్మాణాలతో సమానంగా కనిపించే ఈ మోనోలిత్ ఏకశిల మూడు వైపులా ఉంటుంది. మెరిసే లోహాపు పలకలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీన్ని మిస్టరీ మోనోలిత్ అని పిలుస్తారు. ఈ లోహపు నిర్మాణం భూమిపై నిర్మించినట్లుగా కనిపిస్తోంది. దీని నిర్మాణం కోసం భూమిని తవ్విన ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు.  బేస్ మట్టం కూడా ఎక్కడా లేదు. అసలు ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది. పార్కులో ఈ మోనోలిత్ ఏకశిలను ఎవరు నిర్మించారో తానెప్పుడూ చూడలేదని పార్కులో పనిచేసేవారు అంటున్నారు. ఏకశిల పైభాగంలో ఏవో సంఖ్యలు కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటో తమకు తెలియదని అంటున్నారు పార్కు నిర్వాహకులు.

పార్కుకు సంబంధించిన అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ మోనోలిత్ ఏకశిల ఫొటోలను షేర్ చేశారు. ఈ మిస్టరీ నిర్మాణం త్రిభుజాకారంగా కనిపిస్తోంది. ఉపరితలంపై కొన్ని సంఖ్యలు, చిహ్నాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు ఈ ఏకశిలా పార్కులోకి ఎలా వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. ఈ ఏకశిల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 సిటీల్లో ప్రత్యక్షమైంది. ముందుగా అమెరికాలోని ఊటా ఎడారిలో ఈ మోనోలిత్ ఏకశిల కనిపించింది.

ఆ తర్వాత యూకే, కొలంబియా, రొమేనియా, ఫ్రాన్స్, పోలాండ్ దేశాల్లో కూడా ‘మిస్టరీ మోనోలిత్’ నిర్మాణాలు కనిపించినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా.. అహ్మదాబాద్‌లో మిస్టీరియస్‌ మోనోలిత్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ పార్కు పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు పార్కుకు వీక్షకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.