50 బిలియన్ డాలర్ల వివాహ పరిశ్రమ, శీతాకాలం కోసం సన్నద్ధమవుతోంది.. నవంబర్, డిసెంబర్‌లో శుభ ముహూర్తాలు

  • Published By: naveen ,Published On : September 17, 2020 / 03:14 PM IST
50 బిలియన్ డాలర్ల వివాహ పరిశ్రమ, శీతాకాలం కోసం సన్నద్ధమవుతోంది.. నవంబర్, డిసెంబర్‌లో శుభ ముహూర్తాలు

‘వివాహాలు స్వర్గంలో జరుగుతాయి’ అనేది ఒక నానుడి. కానీ, అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగేది ప్రపంచంలో ఎక్కడ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు ఇండియా. మన దేశంలో పెళ్ళిళ్లు జరిగినంత వైభవోపేతంగా మరెక్కడా జరగవు అని చెప్పొచ్చు. ఆకాశమంత పందిరి, భూదేవి అంత మండపం వేసి అంగరంగ వైభవంగా వివాహాలు జరిపిస్తారు. వందల కోట్లు ఖర్చు పెడతారు. అందుకే, భారత్ లో వెడ్డింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇది వేల కోట్ల రూపాయల బిజినెస్.

కాగా, ఈసారి కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. అన్ని పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. బిజినెస్ లు పడిపోయాయి. కరోనా దెబ్బకు కుదేలైన రంగాల్లో వెడ్డింగ్ బిజినెస్ కూడా ఉంది. కరోనా ఆంక్షల నడుమ వివాహాలు జరుగుతున్నాయి. గతంలో లాగా సందడి లేదు, హంగామా లేదు. పందిళ్లు లేవు, బాజా బజంత్రీలు లేవు.. అతిథులు కూడా చాలా తక్కువ. కొద్ది మంది సమక్షంలో ఎంతో నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది కరోనా.

ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. ప్రభుత్వాలు క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నాయి. అన్నీ అన్ లాక్ అవుతున్నాయి. దీంతో వెడ్డింగ్ బిజినెస్ కు మళ్లీ కళ వస్తోంది. 50 బిలియన్ల డాలర్ల భారతీయ వివాహ పరిశ్రమ, శీతాకాలం కోసం సన్నద్ధమవుతోంది. వ్యాపారం పరిణామం తగ్గి ఉండొచ్చు కానీ, కళను మాత్రం కోల్పోలేదని అంటున్నారు.
https://10tv.in/man-cheating-a-woman-in-pretext-of-marriagehe-enjoy-live-in-relation-with-woman/
భారతదేశంలో సాంప్రదాయ హిందూ వివాహం అంటే, ముందుగా జ్యోతిష్కుడిని కలుస్తారు. ముహూర్తాన్ని ఫిక్స్ చేయించుకుంటారు. “కరోనా మహమ్మారి కారణంగా ఇన్నాళ్లు పెళ్లి సందడి తగ్గింది. కాగా ఇప్పుడు మళ్లీ పెళ్లిళ్లు జోరందుకుంటున్నాయి. ఇది సాధారణం కంటే 3 నుండి నాలుగు రెట్లు ఎక్కువ. లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులు పెళ్లి చేసుకోవాలని చూస్తున్న జంటలకు మార్గం సుగమం చేసింది. మళ్లీ జ్యోతిష్యులు, పండితులు, మేకప్ ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్లు బిజీ అవుతున్నారు.

“నవంబర్ లో చాలా తక్కువ శుభ ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవంబర్ 2, 3, 9, 12 తేదీలు బాగున్నాయని చెప్పారు. డిసెంబర్ విషయానికి వస్తే డిసెంబర్ 1, 7, 8, 9, 11 తేదీలు బాగున్నాయని చెప్పారు. ఈ తేదీల్లో వివాహాలు చేసుకోవచ్చన్నారు. కాగా, లాక్ డౌన్ సమయంలో ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్ పరిశ్రమ 20-30% పెరిగింది, ఇది వివాహాల సంఖ్యలో సహేతుకమైన పెరుగుదలకు దారితీస్తుందని ప్రముఖ ఆన్‌లైన్ వెడ్డింగ్ ప్లాట్‌ఫామ్ షాదీ.కామ్ తెలిపింది.

పెళ్లిళ్ల సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు జువెలరీ కంపెనీలు రెడీ అయ్యాయి. కస్టమర్లను అట్రాక్ చేసేందుకు భారీగా ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ సీజన్ ను క్యాష్ చేసుకుని తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నాయి. కరోనా కారణంగా ఎదురైన నష్టాలను పూడ్చుకోవాలని చూస్తున్నాయి. ఇక మేకప్ ఆర్టిస్టులు, ఫోటోగ్రాఫర్లు, ఇతర సర్వీసు ప్రొవైడర్లు ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు. వారికి కూడా పని దొరుకుతోంది.