India’s 75th Independence Day : భారతదేశ అభివృద్ధికి ఐదు సూత్రాలు చెప్పిన ప్రధాని మోడీ..ఏంటా సూత్రాలు

అఖండ భారతావని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. మహానుభావుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. మనసు నిండా దేశభక్తితో పొంగిపోయింది. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. రాబోయే 25 ఏళ్ల ఉండాలో.. ఎలా ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా మారతామో పిలుపునిచ్చారు. ఇండియా ఫస్ట్ అనే కలను కనాలంటూ యువతకు పిలుపునిస్తూ.. ఐదు సూత్రాలు సూచించారు.

India’s 75th Independence Day : భారతదేశ అభివృద్ధికి ఐదు సూత్రాలు చెప్పిన ప్రధాని మోడీ..ఏంటా సూత్రాలు

India's 75th Independence Day

India’s 75th Independence Day : అఖండ భారతావని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. మహానుభావుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. మనసు నిండా దేశభక్తితో పొంగిపోయింది. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. రాబోయే 25 ఏళ్ల ఉండాలో.. ఎలా ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా మారతామో పిలుపునిచ్చారు. ఇండియా ఫస్ట్ అనే కలను కనాలంటూ యువతకు పిలుపునిస్తూ.. ఐదు సూత్రాలు సూచించారు.

దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడమే కాదు.. దేశ జనాలను ప్రేమించడం కూడా ! ఈ గుణమే.. భారత్‌ను ప్రపంచపటంలో ప్రత్యేకంగా నిలిపింది. ఈ గుణమే 2వందల ఏళ్ల పరాయి పాలనను సాగనంపేలా చేసింది. స్వాతంత్ర్యం సాధించేలా ప్రేరేపించింది. 75 ఏళ్ల స్వేచ్ఛా భారతంలో ఎన్నో మైలురాళ్లకు కారణం అయింది. భారతదేశం.. ప్రపంచ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఆలయం. అన్ని రంగాల్లోనూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రాంతం. భిన్నత్వంలో ఏకత్వం గల విశేష ప్రదేశం.. మనదేశం. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. అఖండ భారతావని పులకించిపోయింది. అణువణువునా దేశభక్తి నిండిపోయింది. దేశవ్యాప్తంగా అమృతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయ్.

75ఏళ్లలో భారతదేశం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఎన్నో సమస్యలను దాటింది. ఆర్థికంగా ఎంతో మెరుగయింది. ఐతే ఎలాంటి మార్పు వచ్చినా.. ఎలాంటి ప్రగతి సాధిస్తున్నా.. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశంగానే మిగిలిపోతోంది. అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారేది అన్న ప్రశ్న.. ఇప్పటికీ ఎన్నో మనసులను ప్రశ్నిస్తుంది. వందేళ్ల ఉత్సవాల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడదామంటూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని.. రాబోయే పాతికేళ్లలో అభివృద్ధికి ఐదు సూత్రాలు ప్రతిపాదించారు.

75ఏళ్లలో భారత్‌ ఎదుర్కొన్న అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. ఆకలి నుంచి ఉగ్రవాదం వరకు.. చాలా పోరాటాలు చేసింది. చేస్తూనే ఉంది. కొన్నిట్లో విజయం సాధించింది.. మరికొన్నింట్లో విజయానికి చేరువగా వచ్చింది. ఇలాంటి సమయంలో 75ఏళ్ల ఉత్సవాలు.. కొత్త జోష్ నింపడం ఖాయం. ఇదే ఉత్సాహాన్ని రాబోయే పాతికేళ్లు కొనసాగించాలని ప్రధాని మోదీ సూచించారు. దేశ ప్రజలు 5అంశాలపై ప్రధాన దృష్టి సారించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపడంతో పాటు.. దేశంలో ఇంకా బానిసత్వం ఉంటే నిర్మూలించాలని.. దేశ చరిత్ర, స్వతంత్ర పోరాట యోధుల త్యాగాలపై గౌరవం ఉండాలని.. జనమంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని.. దేశం కోసం, దేశ లక్ష్యాల కోసం కృషిచేయాలనే సంకల్పం ఉండాలని దేశానికి పిలుపునిచ్చారు.

ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేకత.. ఏ దేశానికి లేని బలం భారత్ సొంతం. అదే యువ బలం. రాబోయే 25 ఏళ్లు ఎలా ఉండాలి.. ఉండబోతోంది అన్నది యువత మీదే ఆధారపడి ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రధాని చెప్పింది కూడా అదే ! భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పంతో యువత అడుగులు పడాలని పిలుపునిచ్చారు. మనం ఏది చేసినా.. ఇండియా ఫస్ట్ దృక్పథంతో చేయాలని సూచించారు. అప్పుడే దేశంలో, దేశ ప్రజల్లో ఐకమత్య భావన ఏర్పడుతుందని.. స్త్రీ, పురుష సమానత్వం లేనిదే.. సమానత్వ భావనకు పరిపూర్ణత చేకూరదని ప్రధాని ఎర్రకోట నుంచి పిలుపునిచ్చారు.

75 ఏళ్ల భారతంలో భారతదేశంలో ఎన్నో సాధించింది. ఇప్పుడు ప్రపంచం తీసుకుంటున్న నిర్ణయాలను.. డిసైడ్ చేసే స్థాయికి చేరుకుంది. భారతీయులు తలుచుకుంటే ఏం సాధించొచ్చు.. భారతీయులు సాధిస్తే ఆ విజయం స్థాయి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ప్రపంచానికి ఎంతోమంది మేధావులను, ఎన్నో ఆవిష్కరణలను పరిచయం చేసింది. 75ఏళ్లుగా భారత్‌లో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందంటే.. ఈ దేశం సాధించిన ప్రగతికి ఇంతకుమించిన తార్కాణం లేదు. కలలు కనడమే కాదు.. సాకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 25ఏళ్లలో ఆర్థికంగా ఏ స్థాయిలో దూసుకెళ్తామన్న దాని మీదే.. భారత్ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది..