India Covid : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆంక్షలు ఫలితాలను ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి.

India Covid : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

Indias Active Covid Caseload Dips

India Covid : కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఆంక్షలు ఫలితాలను ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. తాజాగా 19లక్షల 25వేల 374మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,27,510 కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోలిస్తే 16 శాతం తగ్గుదల కనిపించింది. వరుసగా 5వ రోజు కేసులు తగ్గుముఖం పట్టాయి.

ఇక 24గంటల వ్యవధిలో మరో 2వేల 795 మంది కరోనాతో చనిపోయారు. ఏప్రిల్ చివరి నుంచి మే నెల మొత్తం భారీగా నమోదైన కరోనా మరణాలు.. నిన్న మూడు వేల దిగువకు చేరటం ఊరట కలిగిస్తోంది. మొత్తంగా 2,81,75,044మంది వైరస్ బారిన పడగా..3,31,895మంది మహమ్మారికి బలయ్యారు.

ఇక, యాక్టివ్ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 18లక్షల 94వేల 520మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 7.22 శాతానికి పడిపోయింది. నిన్న(మే 31,2021) ఒక్కరోజే 2లక్షల 55వేల 287మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 2.59కోట్ల మందికిపైగా వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 91.60శాతానికి చేరింది.