Covid Vaccine : అత్యంత చవకైన కొవిడ్ వ్యాక్సిన్..రూ. 400 కన్నా తక్కువే!

అత్యంత చవకైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో వస్తుందా... అంటే... అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు. వ్యాక్సిన్‌ కోసం ఇకపై వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం వందల్లోనే రెండు డోసులు పూర్తయ్యేలా తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ధరల విధానంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో... బయోలాజికల్‌ ఈ సంస్థ నుంచి చౌకైన కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.

Covid Vaccine : అత్యంత చవకైన కొవిడ్ వ్యాక్సిన్..రూ. 400 కన్నా తక్కువే!

Covid

Cheapest Covid vaccine : అత్యంత చవకైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో వస్తుందా… అంటే… అవుననే అంటున్నాయి వైద్య వర్గాలు. వ్యాక్సిన్‌ కోసం ఇకపై వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కేవలం వందల్లోనే రెండు డోసులు పూర్తయ్యేలా తెలుస్తోంది. వ్యాక్సిన్‌ ధరల విధానంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో… బయోలాజికల్‌ ఈ సంస్థ నుంచి చౌకైన కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. బయోలాజికల్‌ ఈ సంస్థకు చెందిన కార్బెవాక్స్‌ రెండు మోతాదులకు కలిపి కేవలం 400 రూపాయలు కన్నా తక్కువ ధరకు లభించనుంది. బయోలాజికల్‌ ఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దత్లా ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఫైనల్‌ ధర ఇంకా ఖరారు కాలేదని వెల్లడించారు.

కార్బెవాక్స్ అత్యంత చౌకైన కొవిడ్ -19 వ్యాక్సిన్లలో ఒకటి అని మహిమా దత్లా తెలిపారు. సీరం ఇనిస్టిట్యూచ్‌ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ ధర రాష్ట్ర ప్రభుత్వాలకు 300 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోసుకు 600 రూపాయలు విక్రయిస్తోంది. ఇక భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ అయితే… రాష్ట్రాలకు 400 రూపాయలు, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక్కో డోస్‌కు 12 వందల రూపాయలు చొప్పున వసూలు చేస్తోంది.

వాస్తవానికి… కేంద్రానికి ఒక మోతాదు ధర 150 రూపాయలుగా ఉంటుంది. ఇది స్థానికంగా తయారైన వ్యాక్సిన్లకు చెల్లించాల్సిన మొత్తం. మరోవైపు, దిగుమతి చేసుకున్న రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ విను డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ 995 రూపాయలుగా నిర్ణయించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే రెండు దశల ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న స్పుత్నిక్‌ వి… 30 కోట్ల మోతాదుల వ్యాక్సిన్‌ కోసం కేంద్రం ఇప్పటికే 15 వందల కోట్ల రూపాయలను ముందస్తుగా చెల్లింపులు చేసింది.

Read More : AIIMS Vaccination : వ్యాక్సిన్‌తో తీవ్ర అనారోగ్యం, మరణం ముప్పు తక్కువ