Science Journal : షాకింగ్ న్యూస్..ఇండియాలో 32 లక్షల కరోనా మరణాలు!

కొవిడ్‌కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. సెప్టెంబర్‌ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్‌ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా.

Science Journal : షాకింగ్ న్యూస్..ఇండియాలో 32 లక్షల కరోనా మరణాలు!

Covid (2)

India’s Covid Deaths : దేశంలో కరోనా మరణాలపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు.. అసలు మరణాలకు చాలా వ్యత్యాసం ఉందనే అనుమానాలున్నాయి. దేశంలో ఇప్పటివరకూ దాదాపుగా ఐదు లక్షల మరణాలు నమోదయ్యాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ అధికారిక లెక్కల కంటే 6 నుంచి 7 రెట్లు ఎక్కువని అంటోంది ఓ అధ్యయనం. గతేడాది సెప్టెంబర్‌ నాటికే దేశంలో32 లక్షల కొవిడ్‌ మరణాలు సంభవించి ఉండవచ్చని అంచనా వేసింది.

Read More : శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణయం.. సాంప్రదాయ దుస్తుల్లో వస్తేనే దర్శనం

ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌ ఈ షాకింగ్ విషయాలను జర్నల్ సైన్స్‌లో వెల్లడించింది. డెల్టా వేరియంట్‌ ప్రభావానికి రోజూవారి కేసుల సంఖ్య అత్యధికంగా 4లక్షలకు చేరింది. దీంతో.. లక్షల మంది కొవిడ్‌ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడాయి. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ కొరతతో కొవిడ్‌ బాధితులు అల్లాడిపోయారు. ఆ సమయంలో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోకు చెందిన ప్రొఫెసర్‌ ప్రభాత్‌ ఝా నేతృత్వంలో ఈ సర్వే జరిగింది.

Read More : Corona Flight: దేశంలోకి కరోనాను మోసుకొస్తున్న విమాన ప్రయాణికులు

మార్చి 2020 నుంచి జులై 2021 మధ్యకాలంలో చేపట్టిన ఆ సర్వేలో.. లక్షా 37వేల మంది నుంచి వివరాలు సేకరించారు. మొత్తం మరణాల్లో 32లక్షల మరణాలు కొవిడ్‌ కారణంగానే జరిగినట్లు అంచనా వేశారు. కేవలం ఏప్రిల్‌-జులై 2021 మధ్యకాలంలోనే 27లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కగట్టారు. వివిధ కారణాలతో సంభవించే మరణాలపై కొవిడ్‌కు ముందున్న సమాచారంతో పోలిస్తే.. 27శాతం పెరిగినట్లు గుర్తించారు పరిశోధకులు. సెప్టెంబర్‌ 2021నాటికి దేశంలో అధికారికంగా గుర్తించిన కొవిడ్‌ మరణాల కంటే 6 నుంచి 7రెట్లు ఎక్కువగా సంభవించినట్లు తమ విశ్లేషణలో తేలిందని వెల్లడించారు నిపుణులు.