Corona In India : లెక్కలోకి రాని 49 లక్షల కరోనా మరణాలు..ఒక్క నెలలోనే 1.7 లక్షల మంది మృతి

భారతదేశంలో కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది లెక్కలోకి రాని మరణాలు నమోదయి ఉంటాయని ఓ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 49 లక్షల మరణాలు లెక్కలోకి రాలేదని నివేదిక పేర్కొంది.

Corona In India : లెక్కలోకి రాని 49 లక్షల కరోనా మరణాలు..ఒక్క నెలలోనే 1.7 లక్షల మంది మృతి

Corona In India

India excess deaths could be up to 49 lakh : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల లెక్కల్లో ఏదేశానికి ఆదేశం తక్కువ చేసి చెప్పిన సందర్భాలున్నాయి. దీనికి కారణం కరోనా కట్టడిలో విఫలం అయ్యినట్లుగా విమర్శలు వస్తాయని కావచ్చు..లేదా ప్రజల్ని మరింత భయాందోళనలకు గురి చేయటం ఎందుకని కావచ్చు. ఇలా కారణం ఏదైనా కరోనా మరణాల జాబితా లెక్కల్లో తేడాలున్నాయి. అధికారికంగా తెలిపే లెక్కల్లో కూడా ఈ తేడాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా భారత్ లో కరోనా మరణాలు తక్కువేం కాదు. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో మరణాలు ఎంత భారీగా ఉన్నాయో తెలిసిందే. కానీ అధికారిక లెక్కల్లో తేడాలు ఉన్నట్లుగా ఓ అధ్యయనం వెల్లడిస్తోంది.

భారతదేశంలో కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది లెక్కలోకి రాని మరణాలు నమోదయి ఉంటాయని ఓ అధ్యయనం నివేదిక వెల్లడించింది. దాదాపు 49 లక్షల మరణాలు లెక్కలోకి రాలేదని మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం..చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ అధ్యయనం నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని రకాల మరణాలపై ఈ అధ్యయనం విశ్లేషించగా ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. అమెరికా, బ్రెజిల్ తరువాత ప్రపంచంలోనే మూడో అత్యధికంగా కరోనా మరణాలు భారతలోనే జరిగాయని అధికారికంగా 4,14,000మందికి పైగా మరణించారని నివేదించింది.

ప్రస్తుతం దేశంలో నమోదైన కరోనా మరణాలపై ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. సెకండ్ వేవ్ లో ఒక్క మే నెలలోనే 1.7 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో 34 లక్షల నుంచి 49 లక్షల వరకు అదనపు మరణాలు నమోదై ఉంటాయని తెలిపింది. అయితే, అవన్నీ కూడా కరోనా మహమ్మారి వల్లే సంభవించినవని చెప్పలేమని, దానికి ఎన్నో కారణాలూ ఉండి ఉంటాయని స్పష్టం చేసింది.

జనాభాలో మూడింట రెండొంతుల మంది నివసించే భారతదేశం వనరుల కొరత ఎక్కువగా ఉందని,చాలామంది పరీక్షించకుండానే ఇంట్లో మరణించారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. వ్యాక్సిన్ కొరతతో డోసులు పంపిణీ ఆలస్యం కావటంతో కరోనా కేసులు మరింతగా పెరగటానికి కారణమయ్యాయి.కాగా కరోనా మరణాల విషయంలో ప్రతి దేశమూ లెక్కలోకి రాని మరణాలపై ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు.