కరోనాను కట్టడిచేద్దాం. మాటలు సరే. ఇంతకీ టెస్టింగ్ కిట్లెక్కడ?

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 10:21 AM IST
కరోనాను కట్టడిచేద్దాం. మాటలు సరే. ఇంతకీ టెస్టింగ్ కిట్లెక్కడ?

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ను పరీక్షించే రాపిడ్‌టెస్టింగ్ కిట్లు వారం క్రితం దేశానికి రావాల్సిఉన్నా, ఇప్పటి వరకు రావకపోవటంతో, వచ్చే వారంలో అయినా అందుబాటులోకి వస్తాయా లేదా అన్న సందిగ్ధం. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 9వేలకు పైగా పెరిగిపోయ్యాయి. 300 మందికి పైగా చనిపోయారు. 

ఇప్పటికే అందుబాటులో ఉన్న పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR)కిట్లతో వైరస్ నిర్ధారణ పరీక్షకి 24- 48 గంటల సమయం పడుతుంది. రాపిడ్ కిట్లతో  వైరస్ పాజిటివ్ నిర్ధారణ పరీక్ష చేయటానికి 15- 30 నిమిషాలు చాలు. ఈ కిట్ల ఉత్పత్తికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఏప్రిల్ మెుదటి వారంలో చైనాలోని 7 కంపెనీలకు దిగుమతి లైసెన్సులను జారీ చేసింది.  దేశంలో రోజుకు 16 వేల మందిని మాత్రమే పరీక్షించగలం. ఈ రాపిడ్ టెస్టింగ్ కిట్లతో మే 31, 2020 వరకు రోజుకు లక్ష మందిని పరీక్షించాలనేది లక్ష్యం.

కేంద్రం ICMRకు మార్చి 27, 2020 నాటికి 10 లక్షల కిట్లను తయారుచేయమని ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చిన గడువు కంటే ఒక్కరోజు ఆలస్యంగా 5 లక్షల కిట్లను మాత్రమే ICMR తయారు చేయగలిగింది. అందులో 2.5 లక్షల కిట్లను మాత్రమే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఈ కిట్లను ఉత్పత్తి చేసే తయారీదారుల సంఖ్య తక్కువ. ప్రభుత్వాలు ఎగుమతిని పరిమితం చేయడం సమస్యని ICMR తెలిపింది. అంతేదు, తమిళనాడు స్వయంగా 4లక్షల కిట్లు కావాలని చైనాని కోరింది. తమిళనాడుకు రావాల్సిన 4లక్షల కిట్లలో 1లక్ష కిట్లను అమెరికా లాక్కొందని తమిళనాడు ప్రధాన కార్యదర్శి కె.షణ్ముగం అంటున్నారు. 

 
కోవిడ్ 19 కేసులను వేగంగా గుర్తించటం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాబోయే వారంలో గ్రూప్ టెస్టింగ్/పూల్డ్ టెస్టింగ్ పరీక్షలను ప్రారంభించనుంది. ఎక్కువ కోవిడ్ 19 కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర కూడా గ్రూప్/పూల్డ్ టెస్టింగులకు కోసం ICMR అనుమతి కోరింది. కోవిడ్ 19 కేసులను గుర్తించటం కోసం జర్మనీ, ఇజ్రాయిల్ దేశాలు ఇప్పటికే పూల్డ్ టెస్టింగులను వాడుతున్నారు. సెక్సువల్ ట్రాన్స్ మిటెడ్ డిసిజ్ (STD)సిఫిలిస్‌తో బాధపడుతున్న ప్రజలను పరీక్షించటానికి అమెరికాకూడా రెండో ప్రపంచయుద్ధంలో గ్రూప్ టెస్టింగులను ఉపయోగించింది. ఈ గ్రూప్ టెస్టింగ్‌తో రెండు, మూడు జిల్లాలో ఉన్న ప్రజలను ఒకే రోజులో పరీక్షించగలం అని యూపీ అంటోంది.