RoofTop Theatre: ఇండియాలో ఫస్ట్ రూఫ్ టాప్ థియేటర్.. కారులోంచే సినిమా చూడొచ్చు

ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఓపెన్ రూఫ్ టాప్ థియేటర్‌లో ఇండియాలో కూడా అందుబాటులోకి రాబోతుంది.

RoofTop Theatre: ఇండియాలో ఫస్ట్ రూఫ్ టాప్ థియేటర్.. కారులోంచే సినిమా చూడొచ్చు

Canva

RoofTop Theatre: ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఓపెన్ రూఫ్ టాప్ థియేటర్‌లో ఇండియాలో కూడా అందుబాటులోకి రాబోతుంది. ఇండియాలో ఫస్ట్ టైమ్ రూఫ్-టాప్ థియేటర్‌ని రిలయన్స్ తీసుకుని వస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్(JWD)లో ప్రపంచంలోనే మొట్టమొదటి రూఫ్‌టాప్, ఓపెన్-ఎయిర్, జియో డ్రైవ్-ఇన్ థియేటర్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.

రిలయన్స్ ఆవిష్కరించిన ప్రీమియం షాపింగ్ మాల్ జియో వరల్డ్ డ్రైవ్ (JWD), ముంబైలో టెక్నాలజీ, స్టైల్.. అత్యాధునిక ఆవిష్కరణలతో కష్టమర్లకు ప్రపంచస్థాయి రిటైల్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ రూఫ్ టాప్ దీపావళి తర్వాత ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

ఈ థియేటర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు కారును ఓపెన్ ఏరియాలో పెట్టుకుని, అందులో నుంచే చూడవచ్చునని చెబుతున్నారు సంస్థ నిర్వహకులు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తర్వాత సినిమా, థియేటర్ వ్యాపారం నష్టాలపాలైంది. ప్రస్తుతం కొన్ని థియేటర్లు తెరుచుకుంటున్నప్పటికీ కరోనా సోకుతుందనే భయం వారిలో ఉంది. ఓపెన్ ఎయిర్ థియేటర్ అనే కాన్సెప్ట్‌ విదేశాల్లో చాలా సక్సెస్ అయ్యింది. మన దేశంలో మాత్రం రిలయన్స్ తీసుకుని వస్తున్నదే ఫస్ట్ థియేటర్.

పీవీఆర్ సినిమాస్ ఈ సినిమా హాల్‌ను నిర్వహించబోతుండగా.. అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఈ థియేటర్‌లో 290కార్ల సామర్థ్యం ఉంటుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 17.5 ఎకరాల విస్తీర్ణంలో జియో వరల్డ్ డ్రైవ్ ఉంది. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లు మాత్రమే లభ్యమవుతూ ఉంటాయి.