దేశంలో ఫస్ట్‘టాయ్‌లెట్’కాలేజ్ : 3200 మందికి ట్రైనింగ్

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 09:41 AM IST
దేశంలో ఫస్ట్‘టాయ్‌లెట్’కాలేజ్ : 3200 మందికి ట్రైనింగ్

భారత తొలి టాయ్‌లెట్ కాలేజీ నుంచి 3200 మంది విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2018 ఆగస్టులో బ్రిటీష్ కన్జ్యూమర్ గూడ్స్ మేజర్ రెకిట్ బెంకిసర్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో హార్పిక్ వరల్డ్ టాయ్‌లెట్ కాలేజీని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో భాగంగా ఎదురవుతున్న ప్రమాదాల గురించి వారికి అవగాహన కల్పించడం..నాణ్యతాప్రమాణాలతో  పనిచేయటం..మనుషుల అమానవీయ పద్దతుల ద్వారా ఏర్పడే సమస్యలపై కార్మికులకు అవగాహన కల్పించి..వాటిని ఎలా అధిగమించాలనే అంశాలపై ఈ కాలేజీలో ట్రైనింగ్ ఇస్తారు. అంటే బహిరంగ మల మూత్ర విసర్జ వంటి సందర్భాలు భారత్ లో ఇంకా కొనసాగుతున్నాయి. అటువంటి సందర్భాలల్లో పారిశుద్ధ్య వాటిని ఎలా తొలగించాలి అనే అంశాలపై కార్మికులకు ట్రైనింగ్ ను ఇస్తుంది ఈ కాలేజ్, 

ఈ కాలేజీలో శిక్షణ పొందిన కార్మికులకు ప్రముఖ గుర్తింపు పొందిన సంస్థలు, కంపెనీల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఈ కళాశాలలో ప్రతీ రోజు రెండు బ్యాచ్‌ల్లో 3 గంటలపాటు తరగతులు నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్‌లో 25-30 మంది ఉండగా..మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 గంటల వరకు మహిళలకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పురుషులకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తారు.

ఈ కాలేజీని బ్రిటిష్ వినియోగదారుల వస్తువుల మేజర్ రెకిట్ బెంకిజర్ నిర్వహిస్తున్నారు. 3200 మంది విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా రెకిట్ బెంకిజర్ మాట్లాడుతూ..కాలేజ్ ప్రారంభించిన తరువాత 3200 మంది కార్మికులు విజయవంతంగా ట్రైనింగ్ కంప్లీజ్ చేసుకున్నారని తెలిపారు. వీరిలో 100 శాతం సభ్యులు పర్మినెంట్ ఉపాధి అవకాశాలను పొందటానికి ఈ కాలేజ్  ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు.  

ట్రైనింగ్  కంప్లీట్ చేసుకున్న కార్మికులు గుర్తింపు పొందిన నేషనల్ కంపెనీల్లోను పలు ప్రైవేట్ సంస్థల్లోను చక్కటి ఉద్యోగాలు పొందారన్నారు.హార్పిక్ వరల్డ్ టాయిలెట్ కాలేజీ 25-30 మంది ప్రతి బ్యాచ్‌కు వారానికి ఐదు రోజులు మూడు గంటల రోజువారీ తరగతులను అందిస్తుంది. మహిళలకు మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకూ క్లాసులు నిర్వహిస్తుండగా.. పురుషులకు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకూ క్లాసులు నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది.