India’s GDP : కోలుకుంటున్న ఎకానమీ..Q2లో జీడీపీ 8.45శాతం

కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశ ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేటు రంగంలో వినియోగం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకొంది. తాజాగా విడుదలైన

India’s GDP : కోలుకుంటున్న ఎకానమీ..Q2లో జీడీపీ 8.45శాతం

Gdp

India’s GDP:  కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశ ఎకానమీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. పెట్టుబడులు పెరగడం, ప్రైవేటు రంగంలో వినియోగం పెరగడంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకొంది. తాజాగా విడుదలైన కేంద్రప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 ఆర్ధిక సంవ‌త్స‌రం రెండో త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి(GDP) అంచ‌నాల‌కు అనుగుణంగా 8.45 శాతం వృద్ధి క‌న‌బ‌రిచింది. నామినల్‌ జీడీపీ 17.5 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఇదే సమయానికి జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి త‌గ్గింది.

2011-12 నాటి స్థిరమైన ధరల ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్ లో జీడీపీని రూ.68.11 లక్షల కోట్లుగా జాతీయ గణాంక కార్యాలయం లెక్కగట్టింది. గతేడాది ఇదే సమయంలో జీడీపీ రూ.59.92 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. స్థిరమైన ధరల వద్ద జీడీపీ పెరుగుదల 13.7 శాతంగా ఉందని వివరించింది.

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరందుకోవ‌డం,ఆర్ధిక కార్య‌క‌లాపాలు వేగ‌వంతం కావ‌డంతోనే జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ప్రోత్సాహ‌క‌రంగా న‌మోదైంది. ఆగస్టు, సెప్టెంబర్లో రైల్వే సరకు రవాణా పెరగడం, సిమెంటు ఉత్పత్తి పెరగడం, విద్యుత్తుకు డిమాండ్‌ పుంజుకోవడం, ఓడ రేవుల్లో సరకు నిల్వ పెరుగుదల, ఈవే బిల్లుల పెరుగుదల, జీఎస్టీ వంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంకేతాలుగా నిలిచాయని ఆర్‌బీఐ అక్టోబర్‌ విధాన సమీక్షలో తెలిపింది.

ఇక,ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జాన్ 2021) జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతంగా నమోదు కాగా, గతేడాది తొలి త్రైమాసికంలో(ఏప్రిల్-జాన్ 2020) జీడీపీ 24.4 శాతం పతనం అయిన విషయం తెలిసిందే.

ALSO READ Farmers Protest : రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే..డిసెంబర్-4న ఆందోళన ముగింపు!