Rudram : భారత్ అమ్ముల పొదిలో యాంటీ రేడియేషన్ మిస్సైల్ “రుద్రం”

భారత్‌ను మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. డీఆర్డీవో త్వరలోనే నెక్ట్స్ జనరేషన్.. యాంటీ రేడియేషన్ మిస్సైల్‌ని లాంఛ్ చేయబోతోంది. దాని పేరే.. రుద్రం. శత్రు దేశాల రాడార్లను మట్టి క

Rudram : భారత్ అమ్ముల పొదిలో యాంటీ రేడియేషన్ మిస్సైల్ “రుద్రం”

Rudra Missile

Anti Radiation Missile Rudram :  భారత్‌ను మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. డీఆర్డీవో త్వరలోనే నెక్ట్స్ జనరేషన్.. యాంటీ రేడియేషన్ మిస్సైల్‌ని లాంఛ్ చేయబోతోంది. దాని పేరే.. రుద్రం. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించేందుకు తయారుచేసిన ఈ మిస్సైల్‌ని.. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారు శాస్త్రవేత్తలు. దేశ రక్షణ రంగంలో.. కీలకమైన ముందడుగుగా దీనిని భావిస్తున్నారు. త్వరలోనే.. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలో చేరనుంది.

దేశానికి ఎలాంటి ముప్పు ఎదురైనా.. స్ట్రాంగ్‌ ఆన్సర్ ఇచ్చేందుకు.. భారత్ అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. అందుకనుగుణంగా.. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే.. అతి త్వరలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలోకి.. సరికొత్త మిస్సైల్ చేరబోతోంది. డీఆర్డీవో డెవలప్ చేసిన ఈ యాంటీ రేడియేషన్ మిస్సైల్‌కి.. రుద్రం అనే పేరు పెట్టారు. కొన్ని నెలల కిందటే.. బాలాసోర్‌లో సుఖోయ్-30 యుద్ధ విమానం నుంచి దీనిని విజయవంతంగా ప్రయోగించారు.. ఈ మిస్సైల్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను మరింత బలోపేతం చేయనుంది.

దేశీయంగా డెవలప్ చేసిన ఈ రుద్రం మిస్సైల్.. చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. ఇది.. శబ్ద వేగానికి.. రెండింతల స్పీడ్‌ కలిగిన తొలి యాంటీ రేడియేషన్ మిస్సైల్ కావడం దీని మరో స్పెషాలిటీ. శత్రు రాడార్లను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని, ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్‌లను.. సుదూర ప్రాంతాల నుంచే నాశనం చేయగలదు. టార్గెట్‌కు వంద కిలోమీటర్ల దూరం నుంచి దీనిని ప్రయోగించినా.. శత్రువుల రాడార్లను గుర్తించి.. వాటిలోకి ప్రవేశించి.. దానిని నాశనం చేసేస్తుంది.

ఒక్కసారి రాడార్ సిస్టమ్ గనక దెబ్బతింటే.. శత్రువులు గుడ్డి వాళ్ల కిందే లెక్క. అప్పుడు.. శత్రు స్థావరాల్లో ఇతర టార్గెట్లపై దాడి చేయడం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఈజీ అవుతుంది. సుఖోయ్ 30, మిరాజ్-2000 లాంటి ఐఏఎఫ్ ఫైటర్ జెట్ల నుంచి రుద్రం మిస్సైల్‌ని ఫైర్ చేయొచ్చు. ఇది.. చాలా కచ్చితత్వంతో.. టార్గెట్లను చేధిస్తుంది. ఎంతలా అంటే.. శత్రువుల రాడార్ సిస్టమ్ ఆపరేట్ చేయకపోయినా..ట్రాక్ చేసి మరీ నాశనం చేస్తుంది.

Also Read : Piyush Jain : పాత స్కూటర్ పై తిరిగే సెంటు వ్యాపారి ఇంట్లో కోట్ల నోట్ల కట్టలు

కశ్మీర్, చైనా సరిహద్దుల్లో వరుసగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సమయంలో.. భారత్ వరుసగా మిస్సైల్స్‌ ప్రయోగాలను నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలోనే.. 4 క్షిపణులను పరీక్షించింది భారత్. మరోవైపు 700 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను.. ఛేదించే కెపాసిటీ ఉన్న శౌర్య మిస్సైల్‌ని కూడా వాడుకునేందుకునే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. అంతేకాదు.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్‌ని కూడా టెస్ట్ చేశారు. వీటితో పాటు హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీ డెమోనిస్ట్రేటర్‌ వెహికల్‌‌ని కూడా భారత్‌ ప్రయోగించింది. ఇది సుదూరాల్లోని లక్ష్యాలను ఛేదించే క్రూజ్‌ మిస్సైల్స్, హైపర్‌ సోనిక్‌ మిస్సైల్స్‌ని మోసుకెళ్తుంది.