Crude Oil Import: రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు దిగుమతులు.. రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి

భారత్‌కు ప్రస్తుతం రష్యా అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. కొన్ని నెలలుగా రష్యా నుంచి ఇండియా అధిక స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుంది. దేశానికి అవసరమైన చమురులో మూడింట ఒక వంతు రష్యా నుంచే దిగుమతి అవుతోంది. అది కూడా డిస్కౌంట్ ధరకే చమురు దొరుకుతోంది.

Crude Oil Import: రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు దిగుమతులు.. రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి

Crude Oil Import: రష్యా నుంచి భారత చమురు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. గత ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో చమురు దిగుమతైంది. ఫిబ్రవరిలో రోజుకు సగటున 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఇది సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న చమురుకంటే ఎక్కువ కావడం గమనార్హం.

Balagam : బలగం మూవీ కథ నాదే అంటూ మీడియా ముందుకొచ్చిన జర్నలిస్ట్.. డైరెక్టర్ వేణు ఏమంటాడో??

వార్టెక్సా అనే ఎనర్జీ కార్గో ట్రాకర్ సంస్థ నివేదిక ప్రకారం.. భారత్‌కు ప్రస్తుతం రష్యా అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. కొన్ని నెలలుగా రష్యా నుంచి ఇండియా అధిక స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటుంది. దేశానికి అవసరమైన చమురులో మూడింట ఒక వంతు రష్యా నుంచే దిగుమతి అవుతోంది. అది కూడా డిస్కౌంట్ ధరకే చమురు దొరుకుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సమయానికి రష్యా నుంచి భారత్.. మన అవసరాల్లో 0.2 శాతం మాత్రమే దిగుమతి చేసుకునేది. ఇప్పుడిది 35 శాతానికి చేరింది. యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించాయి.

MLC Kavitha: అరవింద్‌పై అందుకే కోపమొచ్చింది.. కేటీఆర్, హరీశ్‎రావు విషయంలో కామెంట్‌ చేసే స్థాయి నాకులేదన్న కవిత

దీంతో అనేక దేశాలకు రష్యా చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. దీన్ని ఇండియా వాడుకుంది. అక్కడి నుంచి చమురు దిగుమతులు పెంచుకుంది. అది కూడా గతంలోకంటే తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకుంటోంది. అమెరికా, చైనాల తర్వాత ప్రస్తుతం ఇండియా మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ తెచ్చుకుంటున్న ఇండియా ఇతర దేశాల నుంచి చమురు దిగుమతుల్ని తగ్గించింది. ప్రస్తుతం భారత రిఫైనరీ సంస్థలు రష్యా నుంచి దిగుమతుల వల్ల లబ్ధి పొందుతున్నాయని వార్టెక్సా సంస్థ తెలిపింది.