Indias Richest Billionaires : ఇండియాలో పెరుగుతున్న ధనవంతులు.. దేశంలో టాప్-10 కుబేరులు వీరే.. కళ్లు బైర్లు కమ్మేంత సంపద

Indias Richest Billionaires : ఇండియాలో పెరుగుతున్న ధనవంతులు.. దేశంలో టాప్-10 కుబేరులు వీరే.. కళ్లు బైర్లు కమ్మేంత సంపద

Indias Richest Billionaires

Indias Richest Billionaires : భారత్ లో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 102 మంది కుబేరులు ఉంటే ఈసారి ఆ సంఖ్య 142కి పెరిగింది. అంతేకాదు వారి సంపద డబుల్ అయ్యింది. 596 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ వ్యక్తుల దగ్గర కళ్లు బైర్లు కమ్మేంత సంపద ఉంది. ఒక్కొక్కరు భారీగానే డబ్బుని పోగేశారు. ఏటేటా వారి సంపద పెరుగుతూనే ఉంది. దేశంలో టాప్ 10 ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్టులో టాప్ త్రీ లో ఉన్న ధనవంతుల సంపదే 100 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం. ఇక ఎప్పటిలాగే.. ముకేష్ అంబానీ అపర కుబేరుడిగా నిలిచాడు.

ఇండియాలో టాప్ 10 ధనవంతులు:

1. ముకేష్ అంబానీ
సంపద..84.5 బిలియన్ డాలర్లు

2. గౌతమ్ అదానీ
సంపద : 50.5 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు : మౌలిక సదుపాయాలు

3. శివ నాడార్
సంపద : 23.5 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు: సాఫ్ట్ వేర్ సర్వీసులు

4. రాధాకిషన్ దమానీ
సంపద : 16.5 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు: రిటైల్, పెట్టుబడులు

5. ఉదయ్ కోటక్
సంపద : 15.9 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు : బ్యాంకింగ్

6. లక్ష్మీ మిట్టల్
సంపద : 14.9 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు : స్టీల్

7. కుమార్ బిర్లా
సంపద : 12.8 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు : కమాడిటీస్

8. సైరస్ పూనావాలా
సంపద : 12.7 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు : వ్యాక్సిన్లు

9. దిలీప్ సంఘ్వీ
సంపద : 10.9 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు : ఫార్మాకూటికల్స్

10. సునీల్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ
సంపద : 10.5 బిలియన్ డాలర్లు
ఆదాయ వనరు : టెలికాం