భారత హుస్సేన్​ బోల్ట్​ “శ్రీనివాస్” ఈ సారి ఓడిపోయాడు

భారత హుస్సేన్​ బోల్ట్​ “శ్రీనివాస్” ఈ సారి ఓడిపోయాడు

India’s Usain Bolt కర్నాటక రాష్ట్రానికి చెందిన 28ఏళ్ల శ్రీనివాస్ గౌడ అనే యువకుడు ఉసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసినట్లు గతేడాది ఫిబ్రవరిలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కంబళ పోటీలో 100మీటర్లను 9.55 సెకన్లలో పరిగెత్తి ఓవర్ నైట్ లో సెన్సేషన్ అయిన శ్రీనివాస్ గౌడ…ఈ ఏడాది ఓడిపోయాడు. స్వల్ప గాయాలతో హాస్సిటల్ లో చేరి చికిత్స పొందుతున్నాడు.

గతేడాది లాగే.. ఈసారి కూడా బురద మళ్లలో పోటీ నిర్వహించింది కంబళ కమిటీ. జనవరి 30-31న ఈ పోటీలు జరిగాయి. మంగళూరులోని హొక్కాడిగోలిలో శనివారం నిర్వహించిన పోటీల్లో శ్రీనివాస గౌడ పాల్గొన్నాడు. తన దున్నతో పరుగు ప్రారంభించిన శ్రీనివాస గౌడ ట్రాక్​ మధ్యలోనే పడిపోయాడు. అతని శరీరం, కాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. అతడిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు.3-4 రోజుల్లో గౌడ కోలుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 6న కాంతబారె, బోడబారె కంబళ పోటీల్లో గౌడ పాలుగొంటాడని అతని బృందంలోని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు, గతేడాదే శ్రీనివాస గౌడ రికార్డునూ మరో కంబాళ వీరుడు నిశాంత్ శెట్టి చెరిపేసిన విషయం తెలిసిందే. గతేడాది కంబళ పోటీల్లో వంద మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ 9.55 సెకన్లలో పరుగెత్తగా..అదే ఏడాది నిశాంత్ కేవలం 9.52 సెకన్లలోనే 100 మీటర్లను పూర్తి చేశాడు. ఒకరే అంటే మరో వ్యక్తి బోల్ట్​ను అధిగమించడం వల్ల అప్పట్లో ఇదో సంచలనంగా మారింది.

కంబళ పోటీలంటే?
కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో ఏటా నిర్వహించే సంప్రదాయబద్థమైన పోటీ. బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది. వేగంగా పరిగెత్తించేందుకుగాను దున్నలను పోటీదారులు కొరడాతో బలంగా కొడుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడంతో కొన్నేళ్ల క్రితం కంబళను నిషేధించారు. కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఆ నిషేధాన్ని తొలగించారు.