భారత్‌లో విద్యార్ధులకంటే ఆవులకే రక్షణ ఉంది : ట్వింకిల్ ఖన్నా

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 09:16 AM IST
భారత్‌లో విద్యార్ధులకంటే ఆవులకే రక్షణ ఉంది : ట్వింకిల్ ఖన్నా

భారతదేశంలో విద్యార్ధుల కంటే ఆవులే సురక్షితంగా ఉన్నాయని ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా అన్నారు. ఢిల్లీలోని జేఎన్ యూలో జరిగిన హింసాత్మక ఘటనపై స్పందించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా తనదైన శైలిలో బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. 

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ట్వింకిల్ ఖన్నా తాజాగా జెఎన్‌యూలో చోటుచేసుకున్న హింసాకాండపై స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇక్కడ (‘భారత్) ఆవులకే విద్యార్థుల కన్నా ఎక్కువ రక్షణ ఉంది అని సెటైర్లు వేశారు. భయపడుతూ బతకాలని ఎవరూ అనుకోవడం లేదు. మీరు హింస ద్వారా జనాలను అణచివేయాలని చూస్తున్నారు..కానీ అది జరగదు. అలా చేస్తే వ్యతిరేకత పెరుగుతుంది. నిరసనలు పెరుగుతాయి. ఇళ్లలో ఉండే ప్రజలు రోడ్లపైకి వస్తారు. మీకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. అని ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

కాగా గతంలో ట్వింకిల్ భర్త అక్షయ్ కుమార్ ప్రధాని మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కూడా అక్షయ్ తో ప్రధాని మోడీ మీ భార్య ట్వింకిల్ ఖన్నా నాపై ట్విట్టర్ లో విమర్శలు చేస్తుంటారు. మీ భార్య నాపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు కాబట్టి..మీరు ఇంట్లో ప్రశాంతంగానే ఉంటారు అని అన్నారు. 
దానికి ట్వింకిల్ కూడా స్పందించారు. నా ట్విట్టర్ ను ప్రధాని చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ సమస్యలపై నేను స్పందిస్తునే ఉంటాను అని తిరిగి ట్వీట్ చేశారు.ట్విట్టర్ లో ఈ విమర్శలు చేసిన ట్వింకిల్ గతంలో ఏఎంయూలో ఇప్పుడు జేఎన్ యూలో తరువాత ఈ దాడులు మీపైకి కూడా రావచ్చు అనే న్యూస్ పేపర్ కటింగ్ ను పోస్ట్ చేశారు. 

JNUలో ఆదివారం (జనవరి 5,2020) 50మంది ముసుగు ధరించిన దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లు, క్రికెట్ బ్యాట్లు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. విద్యార్థులు, లెక్షరర్లపై దాడి చేశారు. జేఎన్ యూలోని కార్లు, బైక్ లను ధ్వంసం చేశారు. జేఎన్ యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ పై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో 30మందికిపైగా విద్యార్ధులు గాయపడ్డారు.