అమ్మేది కూరగాయలు.. ఇంగ్లీషులో అధికారులను కడిగిపారేసింది.. ఏం చదివిందో తెలిసి నోరెళ్లబెట్టారంతా..!

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 09:17 AM IST
అమ్మేది కూరగాయలు.. ఇంగ్లీషులో అధికారులను కడిగిపారేసింది.. ఏం చదివిందో తెలిసి నోరెళ్లబెట్టారంతా..!

Indore లోని ఓ కూరగాయాల మార్కెట్ ఉంది. రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుని కొంతమంది వ్యాపారం నిర్వహిస్తున్నారు. బండ్లను తొలగించాల్సిందేనంటూ మున్సిపల్ అధికారులు ఆదేశించారు. కడుపు తిప్పలు కోసం వ్యాపారం చేసుకుంటున్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవద్దని వ్యాపారులు వేడుకుంటున్నారు.

కానీ ఆ ఆఫీసర్స్ వినిపించుకోవడం లేదు. అక్కడే వ్యాపారం నిర్వహిస్తున్న ఓ యువతి అక్కడకు వచ్చింది. ఇంగ్లీషులో మాట్లాడుతూ నిరసన తెలియచేసింది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతుండగా..కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇంతకు ఏం చదువుకున్నారని అధికారులు అడిగితే..Phd చేశానని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు.

రైసా అన్సారీ యువతి ఇండోర్ లోని దేవి అహల్య యూనివర్సిటీ నుంచి మెటిరియల్ సైన్స్ లో పీహెచ్ డీ (PhD, Doctor Of Philosophy, Material Science) చేసింది. కానీ ఎక్కడా జాబ్ లభించలేదు. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో రైసా కుటుంబ పరిస్థితులు దిగజారాయి. కుటుంబానికి తోడుగా ఉండాలని భావించి తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్మడం ప్రారంభించింది.

అయితే..2020, జులై 23వ తేదీ గురువారం మున్సిపల్ అధికారులు మార్కెట్ కు వచ్చారు. తోపుడు బండ్లను తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. మిగతా వారితో కలిసి అన్సారీ నిరసన తెలియచేసింది. అధికారులు తమను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో స్పష్టమైన ఇంగ్లీషు భాషలో తెలియచేసింది. ఈ సందర్భంగా అన్సారీ మాట్లడుతూ…ఓ పక్క మార్కెట్ ను క్లోజ్ చేశారు. కూరగాయాలను కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు అంటూ వాపోయింది.

ఇక్కడ తాను, కుటుంబసభ్యులు, ఇతరులు మొత్తం 20 మంది దాక వ్యాపారం చేసుకుంటున్నామని, ఇప్పడు వచ్చి బండ్లను తొలగించాలని అధికారులు అంటున్నారని తెలిపింది. ఇంగ్లీషులో మాట్లాడుతుండడంతో ఏమి చదివారని అధికారులు అడిగితే..తాను పీహెచ్ డీ చేశానని. కానీ ఎక్కడా జాబ్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది రైనా.

;