పుట్ పాత్ పై చదువుకుంటూ..10th లో ఫస్ట్ క్లాస్ వచ్చిన బాలిక : గిప్టుగా ఇల్లు ఇచ్చిన అధికారులు

  • Published By: nagamani ,Published On : July 9, 2020 / 01:24 PM IST
పుట్ పాత్ పై చదువుకుంటూ..10th లో ఫస్ట్ క్లాస్ వచ్చిన బాలిక : గిప్టుగా ఇల్లు ఇచ్చిన అధికారులు

చదువుల తల్లి. మట్టిలో మాణిక్యం ఈ చిన్నారి. ఉండటానికి ఇల్లు లేక..కట్టుకోవటానికి సరైన బట్టలు లేక..కనీసం ప్రశాంతంగా కూర్చుని చదువుకునే కనీస సౌకర్యం కూడా లేని ఓ బాలిక చదువుల్లో ప్రతిభను కనబరిచింది. ఫుట్‌పాత్‌పై చదువుకుంటూనే పదో తరగతిలో ఫస్ట్‌ క్లాస్ మార్కులు సాధించి ఫుట్ పాత్ మాణిక్యంలా మెరిసింది. కష్టపడి చదివి
68 శాతం మార్కులు తెచ్చుకుంది. ఆ చదువుల తల్లి పేరు భారతి ఖండేకర్.

ఆ బాలిక ప్రతిభను ప్రశంసించిన అధికారులు ఆమె కుటుంబానికి ఓ ఇంటిని బహుమానంగా ఇచ్చారు. దీంతో ఫుట్ పాత్ పై చదువుకునే భారతి సొంత ఇంటికి మారనుంది. తమ కూతురు కష్టానికి ప్రతిఫలంగా సొంత ఇల్లు లభించిందని ఆమె తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివసిస్తున్న దశరథ్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ ఫుట్‌పాత్‌పైనే జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ కూలీ పనికి వెళ్తేనే వారికి కడుపులు నిండుతాయి. అటువంటి నిరేపేద కుటుంబంలో పుట్టింది భారతీ ఖండేకర్.

చదువుకుంటే తప్ప తమ జీవితాలు మారవని అంత చిన్నవయస్సులోనే నమ్మిన భారతి కష్టపడి చదువుకుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో చదివినవారు కూడా చదువుల్లో వెనుకబడుతున్నారు.కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న భారతి ఇటీవల వచ్చిన 10th క్లాస్ పరీక్షల్లో
68 శాతం మార్కులు సాధించింది.
ఇమె పరిస్థితి మున్సిపల్ అధికారులు తెలుసుకొని వారికో ఇంటిని బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు అధికారులు.భారతి ఇంకా పై చదువులు చదువుకోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని దీవించారు. మంచిగా చదువుకుని నీలాంటివారికి మార్గదర్శిగా మారిలని భారతిని అభినందించారు. ఐఏఎస్ కావాలనేది తన కోరిక అంటూ ఆమె పట్టుదలకు అందరూ మెచ్చుకోవాల్సిందే. సొంత ఇల్లు వచ్చినందుకు వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

గతంలో భారతి కండేకర్ కుటుంబం శివాజీ మార్కెట్‌లోని పేవ్‌మెంట్ ముందువైపున ఉన్న ఒక గుడిసెలో ఉండేది. ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతల్లో భాగంగా ఆ గుడిసెను కూడా కూల్చివేశారు. అలా వారి కుటుంబం ఉండటానికి నిలువ నీడ లేక ఫుట్ పాత్ మీదనే జీవిస్తున్నారు.

భారతి తండ్రి దశరథ్ రోజువారీ కూలిపనికి వెళ్తాడు. తల్లి ఓ చిన్న షాపులో స్వీపర్ గా పనిచేస్తుంటుంది. భారతి కూడా స్కూల్స్ కు సెలవులు ఇచ్చినప్పుడు చిన్న చిన్న పనులు చేస్తు డబ్బులు సంపాదిస్తుంది. అలా కష్టపడి చదువుకుని 10క్లాస్ లో 68శాతం మార్కులు తెచ్చుకుంది. పుట్ పాత్ మీదనే కూర్చుని అర్థరాత్రి వరకూ చదువుకుంటుంది భారతి.తన ఇంటికి పెద్ద కూతురు అయిన భారతి తన తమ్ముళ్లను కూడా చదివించుకోవాలని ఆశపడుతోంది. ఐఏఎస్ అవ్వాలని భారతి కోరిక నెరవేరాలని కోరుకుందాం.