రూ.500 లంచం డిమాండ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు : తిక్కరేగి బండికి నిప్పు పెట్టాడు

కొత్త మోటార్ వాహన చట్టంపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. భారీ చలాన్లతో జేబులు గుల్ల చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చాక ట్రాఫిక్

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 02:35 PM IST
రూ.500 లంచం డిమాండ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు : తిక్కరేగి బండికి నిప్పు పెట్టాడు

కొత్త మోటార్ వాహన చట్టంపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. భారీ చలాన్లతో జేబులు గుల్ల చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చాక ట్రాఫిక్

కొత్త మోటార్ వాహన చట్టంపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. భారీ చలాన్లతో జేబులు గుల్ల చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ చట్టం వచ్చాక ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో వ్యవహారం శ్రుతి మించింది. ఓ బైకిస్ట్ కోపంతో తన వాహనానికి ఏకంగా నిప్పు పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. చలాన్ల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఓ యువకుడు తన బైక్ కి నిప్పు పెట్టాడు. ఆదివారం(సెప్టెంబర్ 22,2019) రాత్రి మాల్వా మిల్ పాయింట్ దగ్గర ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఓ యువకుడి బైక్ ని ఆపారా. చలానా వేసి రూ.500 ఇవ్వాలని అడిగారు. తన దగ్గర డబ్బులు లేవని.. అనారోగ్యంతో బాధపడుతున్నాని ఆ యువకుడు వాపోయాడు. దాదాపు గంట సేపు పోలీసులను వేడుకున్నాడు. అయినా పోలీసులు వినలేదు. దీంతో ఆ యువకుడు అసహనంతో తన బండికి నిప్పు పెట్టాడు. ఆ తర్వాత పారిపోయాడు. వాహనానికి నిప్పు పెట్టడంతో పోలీసులు షాక్ తిన్నారు. ఆ బైకిస్ట్ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

పోలీసులు చలాన్ల పేరుతో తమను వేధిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. వాహనాలను ఆపి రూ.1000 చలానా రాస్తున్నారని, చలానా పడకుండా ఉండాలంటే.. తమకు రూ.500 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని ఓ వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మధ్యప్రదేశ్ లో ఇంకా కొత్త వాహన చట్టం అమల్లోకి రాలేదని.. అయినా ట్రాఫిక్ పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని వాహనదారులు వాపోయారు.

స్థానికులు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ”ట్రాఫిక్ పోలీసులు తమ గుర్తింపుని దాచిపెడుతున్నారు. తమ గుర్తింపు కార్డులను దాచి వాహనదారులను దోచుకుంటున్నారు. మాకు వారి పేర్లు తెలియవు. వాళ్ల ఐడీలు చూపించరు. అన్ని రకాల వాహనాలను ఆపుతారు. కార్లు, వ్యాన్లు, బైక్ ల తో పాటు ఆఖరికి రవాణ వాహనాలను కూడా ఆపుతారు. డబ్బు దండుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు తాగి డ్యూటీలో కనిపిస్తున్నారు. వెయ్యి రూపాయలు చలానా రాస్తారు. చలానా పడకుండా ఉండాలంటే తమకు రూ.500 లంచం ఇవ్వాలని అడుగుతారు. కొత్త మోటారు వాహన చట్టం పేరు చెప్పి డబ్బు దోచుకుంటున్నారు. అసలు మధ్యప్రదేశ్ రాష్ట్రలో ఇంకా కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రాలేదు. కానీ పోలీసులు అప్పుడే దందా షురూ చేశారు” అని వాహనదారులు చెప్పారు.