నడిరోడ్డుపై మ‌హిళ డ్యాన్స్..చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం

ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఓ మహిళ వచ్చి బీబ్రా లైన్ మీద నిలబడి డాన్స్ వేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసులకు ఆదేశించారు.

నడిరోడ్డుపై మ‌హిళ డ్యాన్స్..చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం

Indore Woman Dances At Traffic Signal

Indore woman dances at traffic signal : డాన్స్ వేయాలనే కోరిక ఉంటే ఇంట్లో వేసుకోవచ్చు. లేదా మరెక్కడైనా వేసుకోవచ్చు. కానీ ఓ మహిళకు ఏమనిపించిందో ఎందుకు వేసిందో గానీ..ఇండోర్‌లో నడిరోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డాన్స్ వేసింది. వేసింది వేసినట్లుగా ఉండకుండా తన డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అదికాస్త ఏకంగా మంత్రిగారి దృష్టికి వెళ్లటంతో ట్రాఫిక్ సిగ్నల్ చేసిన ఆమె ఎవరో తెలుసుకుని ఆమెపై చర్యలు తీసుకోండి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెకు నోటీసులు జారీ చేశారు.

Read more: Mumbai Cop: ఈ పోలీసు డ్యాన్స్ కు జనాలు ఫిదా..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో శ్రేయా క‌ర్లా అనే మ‌హిళ ర‌సోమా స్క్వేర్ వ‌ద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్‌పై రెడ్ లైట్ ప‌డిన స‌మ‌యంలో డోజా క్యాట్ సాంగ్‌కు డ్యాన్స్ చేసింది. బ్లాక్ డ్రెస్సు వేసుకున్న ఆమెను చూసి ఆదారిలో వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోతు చూస్తుండిపోయారు. ఏంటీమె నడిరోడ్డుపై ఈ డ్యాన్స్ ఏంటీ అంటూ అవాక్కు అయ్యారు. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.డాన్స్ వేసాక ఆమె వెళ్లిపోయింది. ఆ తరువాత ఎవరి దారినవారు వెళ్లిపోయారు.

Read more : AP : బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్

సీఎం సతీమణి డ్యాన్స్అక్కడితో ఆమె ఆగితే అది వార్త అయ్యేదికాదు..కానీ ఆమె తన డాన్స్ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసేసరికి అదికాస్త మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన మోటార్ వెహికిల్స్ చ‌ట్టం ప్ర‌కారం ఆ మ‌హిళ‌పై చ‌ర్య‌లు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.దీంతో ఆమె ఎవరో గుర్తించి నోటీసులు జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు.