Indore Woman: పాపులారిటీ కోసం నడి రోడ్డుపై ట్రాఫిక్ ఆపేసి యువతి రచ్చ

శ్రేయా కల్రా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్ మూడు రోజుల క్రితం ఓ వీడియో పోస్టు చేసింది. పోస్టు చేసిన తక్కువ టైంలోనే బాగా వైరల్ అయింది.

10TV Telugu News

Indore Woman: ఎవరైనా రెడ్ సిగ్నల్ పడగానే ఏం చేస్తారు.. కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత ముందుకెళ్తారు. కానీ, ఈ యువతి పాపులారిటీ కోసం ఎంత పనిచేసిందంటే.. జీబ్రా క్రాసింగ్ లైన్ మీద నిల్చొని చిందులేయడం మొదలెట్టింది. డ్యాన్స్ వేసింది సోషల్ మీడియాలో పోస్టు చేసింది. క్రేజ్ బాగానే దక్కించుకుంది. ఆ తర్వాతే వచ్చింది అసలు సమస్య.

శ్రేయా కల్రా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్ మూడు రోజుల క్రితం ఓ వీడియో పోస్టు చేసింది. పోస్టు చేసిన తక్కువ టైంలోనే బాగా వైరల్ అయింది. బ్లాక్ డ్రెస్ లో జీబ్రా క్రాసింగ్ మీద డ్యాన్స్ వేయడంతో కార్లు కూడా అలా నిలిచిపోయాయి. అది పూర్తయ్యేవరకూ ట్రాఫిక్ అంతా ఆగిపోయింది.

ఇండోర్‌లోని రసోమా స్క్వేర్ వద్ద తీసిన వీడియోలో మాస్క్ లేకుండా కూడా కనిపించింది ఆ ఇన్‌స్టాగ్రామర్. వీడియోకు వచ్చిన కామెంట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రెడ్ సిగ్నల్ పడితే రూల్స్ బ్రేక్ చేసేస్తావా అని, డ్యాన్స్ వేయడం కోసమే సిగ్నల్ పడిందా అని కామెంట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆమెపై యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యారు అధికారులు.

10TV Telugu News