80 కోట్ల రూపాయల కరెంటు బిల్లు, షాక్ తిన్న 80 ఏళ్ల వృద్దుడు

80 కోట్ల రూపాయల కరెంటు బిల్లు, షాక్ తిన్న 80 ఏళ్ల వృద్దుడు

old Nalasopara,

Rs 80 crore electricity bill : అతని వయస్సు 80 ఏళ్లు..తనకు వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నాడు. వంద కాదు..రెండు వందలు..వేయి రూపాయలు కాదు.. ఏకంగా రూ. 80 కోట్ల రూపాయల బిల్లు చూసి గుండెపోటు వచ్చినంత పనైంది. కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నలసోపారా టౌన్ లో చోటు చేసుకుంది. గణ్ పత్ నాయక్ (80) నలసోపార్ టౌన్ లోని నిర్మల్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి రైస్ మిల్లు ఉంది. క్రమ క్రమంగా వచ్చే కరెంటు బిల్లు ఈసారి కూడా వచ్చింది. కానీ..బిల్లు చూసేసరికి దిమ్మతిరిగింది.

కోట్లలో కరెంటు బిల్లు : –
అతనికి. వేలల్లో కాదు..ఏకంగా కోట్లలో కరెంటు బిల్లు ఉంది. రూ. 80 కోట్ల కరెంటు బిల్లు చూసి బీపీ పెరిగిపోయింది. గింతగనం..ఎక్కడ కరెంటు వాడామా అంటూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కింద పడిపోవడంతో తోటివారు ఆసుపత్రికి తరలించారు. దీనిపై మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (MSEDCL) స్పందించింది.

Maharastra

అధికారుల స్పందన : –
అనుకోకుండా జరిగిందని, త్వరలోనే బిల్లు సరి చేస్తామని, మీటర్ రీడింగ్ తీసుకొనే సమయంలో..జరిగిన తప్పిదం వల్ల ఇలా జరిగిపోయిందన్నారు. ఏజెన్సీ ఆరు అంకెలకు బదులుగా..తొమ్మిది అంకెల బిల్లును తయారు చేసిందని, అతడి విద్యుత్ మీటర్ ను చూసి వారికి ఆరు అంకెల కొత్త బిల్లును ఇచ్చామని విద్యుత్ బోర్డు అధికారి సురేంద్ర మోనెరే వెల్లడించారు.

షాక్ గురయిన పని వాళ్లు : –
విద్యుత్ బిల్లు వచ్చినప్పుడు అక్కడ పని చేస్తున్న వారు షాక్ కు గురయ్యారని, మొత్తం జిల్లాకు సంబంధించిన బిల్లును తమకే పంపించారా ? అని ఆశ్చర్యపోయామని గణ్ పత్ నాయక్ తెలిపారు. దీని గురించి కనుక్కోవడంతో తమకే వచ్చిన బిల్లు అని నిర్ధారించుకున్నట్లు, కరోనా లాక్ డౌన్ సమయంలో ఉన్న బకాయిల బిల్లును వసూలు చేస్తున్నట్లు తెలుసుకున్నట్లు..తమ దగ్గరి నుంచి ఇంత మొత్తం వసూలు చేస్తుందా ? అని భయపడడం జరిగిందని గణ్ పత్ మనవడు నీరజ్ తెలిపారు. మొత్తానికి దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.