INDvSL: గోల్డెన్ డక్‌గా పృథ్వీ.. ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్

కొలంబో స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో పృథ్వీ షా మొదటి బంతికే నిరాశపరిచాడు. అలా తొలి వికెట్ ను కోల్పోయిన టీమిండియా.. 6.1ఓవర్లకే సంజూ శాంసన్ (27)ను కోల్పోవాల్సి వచ్చింది.

INDvSL: గోల్డెన్ డక్‌గా పృథ్వీ.. ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్

Ind Vs Sl

INDvSL: కొలంబో స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20లో లో పృథ్వీ షా మొదటి బంతికే నిరాశపరిచాడు. అలా తొలి వికెట్ ను కోల్పోయిన టీమిండియా.. 6.1ఓవర్లకే సంజూ శాంసన్ (27)ను కోల్పోవాల్సి వచ్చింది. షాతో పాటుగా మరో ఓపెనర్ గా వచ్చిన ధావన్ ( నాటౌట్).. సూర్యకుమార్ యాదవ్(19 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగిస్తున్నారు.

ముందుగా ఊహించినట్లుగానే వన్డే సిరీస్‌లో విఫలమైన మనీశ్ పాండేకు తుదిజట్టులో అవకాశం దక్కలేదు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, భువీ, దీపక్ చాహర్, కృనాల్ పాండ్యా జట్టులోకి వచ్చారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం దక్కింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న గబ్బర్ సేన టీ20 సిరీస్‌ను గెలుచుకోవాలని భావిస్తోంది.

తుది జట్లు
భారత్: పృథ్వీ షా, శిఖర్ ధావన్(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ బానుక, ధనుంజయ, అసలంక, డసన్ షనక(కెప్టెన్), బండారా, వానిందు హసరంగా, చమిక కరుణరత్నే, ఇసురు ఉడానా, అకిలా ధనుంజయ, దుష్మంత్ చమీరా