Infibeam R Srikanth: ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ కంపెనీ కార్యనిర్వాహకాధికారి ఆర్.శ్రీకాంత్ దంపతుల దారుణ హత్య

ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ సంస్థలో కార్పొరేట్ ఫైనాన్స్ విభాగానికి హెడ్ గా పనిచేస్తున్న ఆర్.శ్రీకాంత్ అతని భార్య చెన్నైలోని తమ నివాసంలో హత్యకు గురయ్యారు.

Infibeam R Srikanth: ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ కంపెనీ కార్యనిర్వాహకాధికారి ఆర్.శ్రీకాంత్ దంపతుల దారుణ హత్య

Srikanth

Infibeam R Srikanth: భారత్ లో ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ “ఇన్ఫిబీమ్” సంస్థకు చెందిన అగ్రస్థాయి అధికారి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఇన్ఫిబీమ్ ఫైనాన్స్ సంస్థలో కార్పొరేట్ ఫైనాన్స్ విభాగానికి హెడ్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ రాజగోపాలన్ అతని భార్య చెన్నైలోని తమ నివాసంలో హత్యకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..శ్రీకాంత్ రాజగోపాలన్ అతని భార్య అనురాధ..కొన్ని రోజుల క్రితం అమెరికాలోని తమ కుమార్తె వద్దకు వెళ్లారు. వారు తిరిగి మే 7న చెన్నై చేరుకున్నారు. ఈక్రమంలో శ్రీకాంత్, అనురాధలను ఎయిర్ పోర్ట్ నుండి తీసుకొచ్చేందుకు డ్రైవర్ కృష్ణ వెళ్ళాడు. తన తల్లిదండ్రులు ఇంటికి చేరారో లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికాలో ఉన్న శ్రీకాంత్ కుమార్తె పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడంతో, చెన్నైలో తమ బంధువులకు సమాచారం అందించింది. దీంతో చెన్నైలోని మైలాపూర్ లో ఉన్న శ్రీకాంత్ నివాసానికి చేరుకున్న బంధువు ఒకరు..ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండగా..గదిలో రక్తపు మరకలు గమనించాడు.

Also read:Crime News: పెళ్లయిన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఎలా దొరికారంటే..

ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు..అక్కడకి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. శనివారం(మే 7న) 3.30 గంటల సమయంలో ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి చేరుకున్న వారు హత్యకు గురవడంలో డ్రైవర్ పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు..డ్రైవర్ కృష్ణ గురించి ఆరా తీశారు. కృష్ణనే శ్రీకాంత్ అతని భార్య అనురాధను హతమార్చి అనంతరం వారి కారులోనే పరారవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారుకి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ద్వారా కారు వెళ్లిన టోల్ గేట్ వివరాలు సేకరించిన పోలీసులు..డ్రైవర్ కృష్ణ, చెన్నై – కోల్ కతా హైవే మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు చేరుకుంటున్నట్టు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన చెన్నై పోలీసులు..ఒంగోలు పోలీసులకు సమాచారం అందించగా వారు రంగంలోకి దిగి డ్రైవర్ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:Drunkard Dead: నీళ్లు అనుకుని మద్యంలో యాసిడ్ కలుపుకుని తాగి వ్యక్తి మృతి

డబ్బు నగలు కోసం తానే శ్రీకాంత్ అతని భార్య అనురాధను హత్య చేసినట్లు కృష్ణ పోలీసు విచారణలో వెల్లడించాడు. హత్య అనంతరం మృతదేహాలను సమీపంలోని ఫార్మ్ హౌజ్ లో పూడ్చిపెట్టినట్లు కృష్ణ పేర్కొన్నాడు. దీంతో మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు..పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఇన్ఫిబీమ్ సంస్థలో కార్పొరేట్ ఫైనాన్స్ హెడ్ గా ఉన్న ఆర్.శ్రీకాంత్.. గతంలో జియో ఇన్ఫోకామ్ లో సీఓఓగానూ..పొలారిస్ ఫైనాన్సియల్ టెక్నాలజీ లిమిటెడ్ లోనూ పనిచేసారు. ఆర్.శ్రీకాంత్ హత్యకు గురవడంపై కార్పొరేట్ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి.

Also read:Navneet Vs Thakrey: మరోసారి చిక్కుల్లో ఎంపీ నవనీత్ కౌర్.. మళ్లీ జైలుకు తప్పదా?