inflation Race : ఊహించని స్థాయికి చేరుకున్న ద్రవ్యోల్బణం.. ఆందోళనకంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితి : చిదంబరం
ద్రవ్యోల్బణం ఊహించని స్థాయికి చేరుకుంది..దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకంగా ఉంది అంటూ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తంచేశారు.

inflation Race : రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల ‘చింతన్ శివిర్’లో ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థపై ప్యానెల్‌కు చిదంబరం సారథ్యంవహిస్తున్నారు. ఉదయపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన..దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న తీరుపై విమర్శలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వృద్ధి రేటు రోజురోజుకూ పడిపోతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ద్రవ్యోల్బణం ఎన్నడూ ఊహించని స్థాయికి చేరుకుందని ఇది ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇది ఎనిమిదేళ్ల గరిష్ఠస్థాయి అని ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి.
ఈ క్రమంలో చిదంబరం తగ్గుతున్న వృద్ధి రేటు..పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూల్ గా ఉందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పన్నులు కూడా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలని ఆయన ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న విదేశీ వ్యవహారాల తీరు కూడా ఓ కారణమని ఆయన చెప్పారు. ఊహించని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిందని ఆయన అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నప్పటికీ దాన్ని కేంద్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోతోందని చిదంబరం విమర్శించారు.
Also read : inflation Race : దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం..విలవిల్లాడుతున్న సామాన్య ప్రజలు
దేశ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రపంచ, దేశీయ తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత దేశ ఆర్థిక విధానాలను రీసెట్ చేయాల్సిన అవసరముందని కేంద్రానికి సూచించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం పాలనలో గత ఎనిమిదేళ్లుగా దేశ వృద్ధి రేటు ఏడాదికి ఏడాది మందగించిందని విమర్శించారు. కరోనా సంక్షోభం తర్వాత కూడా వృద్ధి రేటు కోలుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. దిగజారుతున్న ఈ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
2017లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లోపభూయిష్ట జీఎస్‌టీ చట్టాల గురించి అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్థితి మునుపెన్నడూ లేని విధంగా బలహీనంగా ఉన్నాయని.. దీనికి తక్షణ పరిష్కార చర్యలు అవసరమని చిదంబరం సూచించారు.
1991లో పీవీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సరళీకరణతో కొత్త శకానికి నాంది పలికిందని ఈ సందర్భంగా చిదంబరం గుర్తుచేశారు. సంపద సృష్టి, కొత్త వ్యాపారాలు, కొత్త పారిశ్రామికవేత్తలు, భారీ మధ్యతరగతి, లక్షలాది ఉద్యోగాలు, ఎగుమతులతో దేశం అపారమైన ప్రయోజనాలను పొందిందని గుర్తుచేశారు. కేవలం పదేళ్ల కాలంలో 27 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. అయితే గత ద్రవ్యోల్భణం పెరిగిపోతున్నా.. కట్టడి చేయలేని అసమర్థ స్థితిలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.
Also read : Wheat Export Banned: గోధుమల ఎగుమతిని తక్షణమే నిషేదిస్తున్నట్టు ప్రకటించిన భారత్
30 సంవత్సరాల తర్వాత.. ప్రపంచ, దేశీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఆర్థిక విధానాలను రీసెట్ చేయడంపై ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆర్థిక విధానాల రీసెట్ అనేది దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, దిగువ 10 శాతం జనాభాలోని అత్యంత పేదరికం, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ (116 దేశాలలో 101), మహిళలు పిల్లల్లో విస్తృతమైన పోషకాహార లోపం తదితర సమస్యలకు పరిష్కారం చూపేదిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుత ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో కేంద్రానికి దార్శనికత లోపించిందని ఎద్దేవా చేశారు.
1MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
2Kanika Kapoor Marriage: పుష్ప సింగర్ రెండో పెళ్లిలో ఉపాసన సందడి!
3CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
4Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
5Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
6Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
7Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
8Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
9Dandruff : వేధించే చుండ్రు సమస్య!
10NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?