ద్రవ్యోల్బణం అదుపులో ఉంది : మంత్రి నిర్మలా

దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : September 14, 2019 / 10:06 AM IST
ద్రవ్యోల్బణం అదుపులో ఉంది : మంత్రి నిర్మలా

దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని తెలిపారు.

ద్రవ్యోల్బణం అదుపులో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు ఆశాజనకంగానే ఉందన్నారు. తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 5 శాతానికి తగ్గిందని చెప్పారు. శనివారం (సెప్టెంబర్ 14, 2019) దేశ ఆర్థిక పరిస్థితిపై మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ తో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నామని చెప్పారు. 

విదేశీ పెట్టుబడులు మరింత పెరిగే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎగుమతులపై పన్ను విషయంలో పునరాలోచించామని చెప్పారు. విదేశీ పెట్టుబడులు పెరిగేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఇల్లు కొనుక్కునే వారికి మరిన్ని రాయితీలు ఇస్తామని చెప్పారు. సెప్టెంబర్ 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎగుమతులపై పన్ను తగ్గించేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతోందన్నారు. తొలి త్రైమాసికంలో వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు.

Also Read : ఆయిల్ కంపెనీలపై డ్రోన్ దాడులు : చేసింది మేమే.. హౌతీ రెబల్స్ ప్రకటన