Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు

ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లకు చేరింది. స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లెక్కల ప్రకారం.. 2020-21 సంవత్సరంలో రూ.49.68కోట్లుగా ఉండేది.

Infosys CEO: ఇన్ఫోసిస్ సీఈఓ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లు

Infosys

Infosys CEO: ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ శాలరీ 43శాతం పెరిగి రూ.71కోట్లకు చేరింది. స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లెక్కల ప్రకారం.. 2020-21 సంవత్సరంలో రూ.49.68కోట్లుగా ఉండేది.

సలీల్ పరేఖ్‌ను ఐదేళ్ల పదవీ కాలానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా మళ్లీ అపాయింట్ అయ్యారు. భారతదేశంలోని రెండో అతిపెద్ద IT సేవల సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

మిస్టర్ పరేఖ్ జనవరి 2018 నుండి ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

ఆరుగురు కీలకమైన మేనేజ్‌మెంట్ సిబ్బందికి 104,000 షేర్లు, 88 మంది ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు మరో 375,760 షేర్ల మంజూరుకు ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపిన కారణంగా సలీల్ పరేఖ్ గ్రాంట్‌ను పెంచారు.

Read Also: ట్విటర్‌కు కొత్త సీఈఓ..? మరికొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలికే ఆలోచనలో మస్క్..

నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన నందన్ నీలేకని స్వచ్ఛందంగా కంపెనీకి అందించిన సేవలకు ఎలాంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.