First Trans Man Pregnancy : బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్రాన్స్‌జెండర్ యువకుడు..తల్లిదండ్రులు కాబోతున్న దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ జంట
భారతదేశంలో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. మరో నెల రోజుల్లో అంటే మార్చి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు ట్రాన్స్ జెండర్ యువకుడు.

Transgender couple: భారతదేశంలో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. మరో నెల రోజుల్లో అంటే మార్చి నెలలో బిడ్డకు జన్మనివ్వబోతున్నాడు ట్రాన్స్ జెండర్ యువకుడు. కేరళకు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్‌జెండర్ జంట అమ్మానాన్నలు కాబోతున్నారు. దీంతో మా కలలు నెరవేరబోతున్నాయి అంటూ వారు ఇన్ స్టా వేదికగా తమ సంతోషాన్ని షేర్ చేశారు. ‘అమ్మను కావాలనుకునే నా కల, నాన్న కావాలనుకునే తన కోరిక త్వరలోనే నెరవేరబోతోంది అంటూ ఇన్ స్టా వేదికగా వెల్లడించారు అని అమ్మాయిలా మారిన 23 ఏళ్ల జియా పావెల్. తమ కలల ప్రతీరూపానికి స్వాగతం పలటానికి ఈ ట్రాన్స్ జెండర్ జంట ఎంతో ఆశతో..ఆకాంక్షలతో ఎదురు చూస్తోంది.
గర్భం దాల్చేందుకు శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు లేవని కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల బృందం వెల్లడించిటంతో జహాద్ బిడ్డకు జన్మనివ్వటానికి సిద్దమయ్యాడు. అలా గర్భం దాల్చాడు. తన స్త్రీత్వాన్ని నిలుపుకుంటూనే గర్భవతి కావాలని నిర్ణయించుకున్నాడు జహాద్. పుట్టిన బిడ్డ పాల కోసం ఈ జంట కోజికోడ్‌లోని రొమ్ము పాల బ్యాంకులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సహకారంతో శిశువుకు ఆహారం అందించాలని భావిస్తున్నారు.
కేరళకు చెందిన జియా, జహాద్ భార్యభర్తలు. ఇద్దరూ ట్రాన్స్‌జెండర్లే.. జియా పురుషుడిగా పుట్టి స్త్రీగా మారగా, జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిపోయాడు. గత మూడేళ్లుగా కలిసి ఉంటున్న వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. ట్రాన్స్‌జెండర్లైనా అందరిలానే కూడా పిల్లల్ని కనాలని ఈ జంట కోరుకుంది. తన శరీరంలో గర్భసంచి ఇంకా ఉండడంతో.. ఐవీఎఫ్ విధానంతో గర్భం దాల్చాడు జహాద్. ఇప్పుడు అతడికి ఎనిమిదో నెల నడుస్తోంది. మరో నెలల రోజుల్లో డెలివరీ కూడా కాబోతోంది.
ఆడవారికి మాత్రమే దేవుడు ప్రసాదించిన ఏకైక వరం అమ్మదనం. ఇప్పుడు ఆ అమ్మదనాన్ని ఓ ట్రాన్స్‌జెండర్ దక్కించుకున్నాడన్న విషయాన్ని చాలా గొప్పగా చాటాలనుకున్నారు జియాజహాద్‌ల జంట. జియా గర్భం దాల్చాడనే విషయాన్ని ఫొటో షూట్ చేసి తమ ఇన్‌స్టా అకౌంట్ ద్వారా స్వయంగా ప్రకంటించారు. ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
జియాజహాద్ జంటకు పుట్టబోయే బిడ్డ కోసం పేరు కూడా సెలెక్ట్ చేసేశారు. తన అమ్మ అయిన నాన్న గర్భంలో జీవన్ హాయిగా పెరుగుతున్నాడు. త్వరలో ఈ లోకాన్ని చూడబోతున్నాడని ఇన్‌స్టాలో ఫోస్ట్ చేసిందీ జంట. నేను పుట్టుకతోనో, నా శరీరంతోనో స్త్రీని కానప్పటికీ… నేను పెరుగుతుంటే నాలో స్త్రీ తత్వం నాతోపాటే పెరిగింది. నేను స్త్రీగా మారేలా చేసింది. కానీ అమ్మా అవ్వాలనే కల ఉండేది. ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది అంటూ రాసుకొచ్చారు జియా.
ఇక తన అనుభవాన్ని జహాద్ కూడా పంచుకున్నాడు. సమయం మమ్మల్ని ఒకచోట చేర్చింది. మూడు సంవత్సరాలైంది. అతని తల్లి కలలాగే నాది తండ్రి కల. మా కోరిక మమ్మల్ని ఒక ఆలోచనకు తీసుకువచ్చాయి అంటూ రాసుకొచ్చారు.
మనకు తెలిసినంత వరకు దేశంలో ఇదే మొదటి TRAN’S MAN PREGNANCY”. దేవుడు కూడా సృష్టించని ప్రతిసృష్టిని ఆవిష్కరిస్తున్నారు జియాజహాద్ జంట. నాన్న.. అమ్మగా.. అమ్మ.. నాన్నగా మారి… జీవన్‌కు జీవం పోశారు. త్వరలోనే ఈ లోకంలోకి తీసుకురాబోతున్నారు.
ఏది ఏమైనా ఈ వినూత్న రీతిలో అమ్మానాన్న కథ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జియాజహాద్‌ల పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మగాడు అమ్మ కాబోతున్నాడనే ఇంట్రస్టింగ్ పాయింట్.. ఆ డాక్టర్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తితో సెర్చింజన్లు హీటెక్కిపోతున్నాయి.