traders Protest Against Lockdown : కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాగ్‌పూర్‌లో ‘విదర్భ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో వ్యాపారులు ‘థాలీ బజావో’ ఆందోళన నిర్వహించారు. వివిధ వ్యాపార సంస్థలకు చెందిన ప్రతినిధులు పళ్లేలను వాయిస్తూ రోడ్డుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
మొదట్లో వీకెండ్ లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇపుడు అన్ని రోజులకు వర్తింపజేస్తోందని వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి వారం మొత్తం లాక్‌డౌన విధిస్తున్నట్లు జీవో రావడంతో తామంతా షాక్‌కు గురయ్యామని వ్యాపారులు అంటున్నారు.
గత ఏడాది లాక్‌డౌన్‌తో పూర్తిగా నష్టపోయామని ఈసారైనా వ్యాపారం పుంజుకుంటుందన్న తరుణంలో ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ ప్రకటించడంతో తమకు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించే షాపులపై అధికారులు జరిమానా విధించాలి. షాపులు మూసివేయడం సరికాదని వ్యాపారులు అంటున్నారు.