Covid Vaccine: ఇదెక్కడి సాక్ష్యం.. చనిపోయిన పేరెంట్స్‌కు వ్యాక్సిన్ వేసినట్లు మెసేజ్

కొవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకుని నిలబడటానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ముందుగా 45ఏళ్లు కంటే ఎక్కువ వయస్సున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా..

Covid Vaccine: ఇదెక్కడి సాక్ష్యం.. చనిపోయిన పేరెంట్స్‌కు వ్యాక్సిన్ వేసినట్లు మెసేజ్

Covid Vaccine Parents

Covid Vaccine: కొవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి తట్టుకుని నిలబడటానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ముందుగా 45ఏళ్లు కంటే ఎక్కువ వయస్సున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా రాజస్థాన్ కు చెందిన భార్యభర్తలకు వ్యాక్సిన్ వేసినట్లుగా మెసేజ్ వచ్చింది. 2014, 2015లో చనిపోయిన తన పేరెంట్స్ కు వ్యాక్సిన్ ఎవరు వేశారా అని వాళ్ల కొడుకు షాక్ అయ్యాడు.

రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లాకు చెందిన ప్రవీణ్ గాంధీకి రెండు మెసేజ్ లు వచ్చాయని చెప్తున్నాడు. శ్రీ గంగానగర్ జిల్లాలోని హెల్త్ కేర్ ఫెసిలిటీలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు వేసినట్లుగా మెసేజ్ వచ్చిందట. ఐదారేళ్ల క్రితం చనిపోయిన పేరెంట్స్ కు వ్యాక్సిన్ వేయడంపై షాక్ అయ్యాడు ఆ వ్యక్తి.

అదెలా జరిగిందోనని వాకబు చేసిన వ్యక్తికి తెలిసిందేంటంటే.. తన పేరెంట్స్ డాక్యుమెంట్లో మరొకరికి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ కోసం చనిపోయిన తన పేరెంట్స్ డాక్యుమెంట్లను తప్పుడు పద్ధతిలో వినియోగించారని ఉన్నతాధికారులకు చెప్పాడు ప్రవీణ్. ఫేస్ మాస్కులు ఉండటం వల్ల ఎవరో ఒకరు అవకాశాన్ని వాడుకుని ఉండొచ్చని తేల్చేశారు.