భావోద్వేగంతో INS Viraat కు వీడ్కోలు..తుక్కు కింద అమ్మేయనున్నారు

  • Published By: madhu ,Published On : September 20, 2020 / 08:56 AM IST
భావోద్వేగంతో INS Viraat కు వీడ్కోలు..తుక్కు కింద అమ్మేయనున్నారు

INS Viraat Grand Old Lady : ‘ది గ్రాండ్‌ ఓల్డ్‌ లేడీ’గా ఖ్యాతిగాంచిన విమానవాహక నౌక ‘INS Viraat‌’ త్వరలో కనుమరుగుకానున్నది. గుజరాత్‌లోని అలంగ్‌లో విడభాగాలుగా చేసి తుక్కు కింద అమ్మేయనున్నారు. మూడేండ్ల క్రితమే సేవల నుంచి ఈ నౌక వైదొలగింది. శనివారం ముంబాయి నావల్ డాక్ యార్డు నుంచి గుజరాత్ రాష్ట్రానికి బయలుదేరింది.



ఈ సందర్భంగా..నౌకాదళ అధికారులు వీడ్కోలు పలికారు. తీవ్ర భావోద్వేగంతో, ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుని..దానికి ఘనంగా వీడ్కోలు చెప్పారు. తుక్కుకింద అమ్మేయకుండా..ఒక మ్యూజియంగ మార్చాలని అనుకున్నా..అవి సక్సెస్ కాలేదు. ఈ నౌకను అలంగ్ కు చెందిన శ్రీరామ్ గ్రూపు రూ. 38.54 కోట్లకు వేలంలో దక్కించుకుంది.



ఇక దీని చరిత్ర
ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 1500 మంది సిబ్బందిని, 25 యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు.
రెండో ప్రపంచయుద్ధ సమయంలో నిర్మితమైంది. ఇన్ని రోజులు ఏకైక యుద్ధనౌక బహుశా విరాట్‌ మాత్రమేనంటున్నారు.
ఇండియన్‌ నేవీలో చేరే సమయంలో ఇది ఏడేండ్లకు మించి పని చేయదని బ్రిటన్‌ అధికారులు భావించారు. అయితే 30 ఏండ్లపాటు సేవలందించింది.



INS Viraat 1987లో భారత నావికాదళంలో చేరింది.
ఇండియన్‌ నేవీలో చేరిన తర్వాత ఐఎన్‌ఎస్‌ విరాట్‌గా పేరు మార్చారు. అర్ధశతాబ్దానికిపైగా ఈ నౌక సేవలందించింది.
ఆపరేషన్‌ జూపిటర్‌, ఆపరేషన్‌ పరాక్రమ్‌, ఆపరేషన్‌ విజయ్‌ వంటి పలు కీలక మిలటరీ ఆపరేషన్లలో విరాట్‌ పాల్గొంది.
మలబార్‌, అరుణ, నజీమ్‌ అల్‌ బహర్‌, ట్రోపెక్స్‌ వంటి యుద్ధ విన్యాసాల్లోనూ పాల్గొంది.
చివరిసారిగా 2016లో విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంది.