Female Uber driver story : బీటెక్ గ్రాడ్యుయేట్ ఉబెర్ డ్రైవర్‌గా ఎందుకు మారింది?

తను చదువుకుంది. మంచి ఉద్యోగం సంపాదించగలదు.. అయినా తన స్వార్థం చూసుకోలేదు. తండ్రి లేని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉబెర్ డ్రైవర్‌గా మారింది. ఇంజనీరింగ్ చదవి ఉబెర్ డ్రైవర్‌గా మారిన ఓ అమ్మాయి ప్రేరణాత్మక కథ చదవండి.

Female Uber driver story : బీటెక్ గ్రాడ్యుయేట్ ఉబెర్ డ్రైవర్‌గా ఎందుకు మారింది?

Female Uber driver story

Female Uber driver story : ఒక్కోసారి చదువుకున్నది ఒకటి.. చేసే పని ఒకటి అవుతుంది. ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ అంతే. ఆమె బీటెక్ చదువుకుంది. చాలా కంపెనీల్లో పని చేసింది. ప్రస్తుతం ఉబెర్ డ్రైవర్‌గా స్థిరపడింది. ఎందుకలా?

Mumbai : ఉబెర్ ట్యాక్సీలో ముస్లిం డ్రైవ‌ర్ కోసం మ‌హిళ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

కోల్‌కతాకు చెందిన ఉబెర్ డ్రైవర్ దీప్తా ఘోష్ గురించి ఇప్పుడు చెప్పబోయేది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పాసైంది. వివిధ కంపెనీల్లో 6 సంవత్సరాలు పని చేసింది. 2020లో ఆమె తండ్రి అనారోగ్యంతో మరణించారు. దీప్తకు తల్లి, చెల్లెలు ఉన్నారు. కోల్‌కతా దాటి అనేక ఉద్యోగాలు వచ్చాయి ఆమెకు. కానీ తల్లిని, అక్కని వదిలిపెట్టి వెళ్లాలని అనుకోలేదు. అప్పటికే ఆమెకి డ్రైవింగ్‌లో అనుభవం ఉండటంతో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది.

 

ఆల్టోను కొని 2021 లో ఉబెర్ కోసం డ్రైవింగ్ ప్రారంభిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇక తను వెనుతిరిగి చూడలేదు. వారానికి 6 రోజుల పాటు డెయిలీ 6 నుంచి 7 గంటలు డ్రైవింగ్ చేస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడు దీప్తా నెలకు 40,000 రూపాయలు పైగానే సంపాదిస్తోంది.

Maryland Lottery : ఉబెర్ డ్రైవర్‌కు రూ. 75 లక్షల లాటరీ!

దీప్త స్టోరీని పరమ్ కళ్యాణ్ సింగ్ అనే ఫేస్‌బుక్ యూజర్ షేర్ చేసారు. అతను లేక్ మాల్‌కి వెళ్లడానికి క్యాబ్‌ను బుక్ చేసుకోవడంతో దీప్త నుంచి కాల్ వచ్చింది. క్యాబ్ ఎక్కిన తరువాత ఆమె మాట తీరు.. మర్యాద చూసి పరమ్ కళ్యాణ్ ఆమె వివరాలు అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆమె కథ తెలిసి ప్రేరణ కలిగి ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. ఆడవారు ఏం చేయలేరు అనేది నిన్నటి మాట. పరిస్థితులకు తగ్గట్లు తమ జీవితాన్ని, కెరియర్‌ను మార్చుకోగలరు..ఆత్మస్థైర్యంతో ముందుకు నడవగలరు. దీప్త ఘోష్ స్టోరీ నిజంగానే చాలామందిలో స్ఫూర్తి కలిగిస్తుంది. ఇప్పటికే ఆమె కథ తెలుసుకున్న వారు అభినందనలు చెబుతున్నారు.