చెత్త పోస్టులపై యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ వార్నింగ్!

  • Published By: sreehari ,Published On : December 18, 2019 / 02:33 PM IST
చెత్త పోస్టులపై యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ వార్నింగ్!

ఫేస్‌బుక్ సొంత ఫొటో షేరింగ్ యాప్ తప్పుడు పోస్టులు పెడితే తాట తీస్తానంటోంది. యూజర్లు తమ పోస్టుల్లో క్యాప్షన్లపై బెదిరింపులకు గురిచేసేలా పెడితే వెంటనే పసిగట్టేస్తోంది. ఈ మేరకు కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. సోషల్ ప్లాట్ ఫాంపై ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ముందుగానే యూజర్లకు వార్నింగ్ అలర్ట్ ఇస్తోంది.

అంటే.. యూజర్లు ఏదైనా పోస్టులో నేరపూరిత, బెదిరింపులు వంటి క్యాప్షన్ పోస్టు షేర్ చేయడానికి ప్రయత్నిస్తే ముందుగానే అలర్ట్ వస్తుంది. తద్వారా ప్లాట్ ఫాంపై తమ పోస్టులను షేర్ చేయడానికి ముందే చెక్ చేసుకునేలా యూజర్లకు మరో అవకాశం ఇస్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఇదే రకమైన ఫీచర్‌ను ఇన్ స్టాగ్రామ్ తమ యూజర్ల కోసం ప్రవేశపెట్టింది.

ఇందులో యూజర్ల పోస్టులపై ఎవరైనా అసభ్యపదజాలంతో కామెంట్లు పెట్టగానే వార్నింగ్ మెసేజ్ వస్తుంది. అంతేకాదు.. ఇదివరకే ఎవరైనా ఒకే రకమైనా క్యాప్షన్ పెట్టి ఉంటే.. ఈ ఫీచర్ యూజర్లకు మెసేజ్ రూపంలో అలర్ట్ చేస్తుంది. క్యాప్షన్ ఎడిట్ చేసే ఆప్షన్ ఇస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో నుంచి డేంజరస్ కంటెంట్ షేర్ అవుతున్నప్పటికీ వెంటనే తొలగించే విషయంలో ఇన్‌స్టాగ్రామ్ విఫలం కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఆన్‌లైన్‌లో బెదిరింపులు వంటి చర్యలపై నిఘా పెట్టేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్.. తమ ప్లాట్ ఫాంపై కొత్త టెక్నాలజీ, ఫీచర్లను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నో ఫీచర్లను యాప్ కంపెనీ రిలీజ్ చేసింది. ఈ కొత్త ఫీచర్‌పై డాన్ రాయిస్‌బెక్, యాంటీ సైబర్ బులియంగ్ చారిటీ సైబర్ స్మయిల్ సహ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ.. ఆన్ లైన్ వేధింపులను నియంత్రించేందుకు ఇదో సరైన ఉదాహరణగా తెలిపారు.