Bride Dowry : హ్యాట్సాఫ్.. రూ.75లక్షల కట్నానికి బ‌దులుగా… బాలిక‌ల హాస్ట‌ల్ నిర్మించాల‌ని కోరిన వ‌ధువు

మ‌న‌ దేశంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు చేస్తుంటారు. డెకరేషన్, ఫొటోలు, భోజనాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తారు. ఇక క‌ట్నం గురించి చెప్పక్కర్లేదు.

Bride Dowry : హ్యాట్సాఫ్.. రూ.75లక్షల కట్నానికి బ‌దులుగా… బాలిక‌ల హాస్ట‌ల్ నిర్మించాల‌ని కోరిన వ‌ధువు

Bride Dowry

Bride Dowry : మ‌న‌ దేశంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు చేస్తుంటారు. డెకరేషన్, ఫొటోలు, భోజనాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తారు. ఇక క‌ట్నం గురించి చెప్పక్కర్లేదు. కోట్ల రూపాయ‌లు కట్నంగా ఇస్తుంటారు. పెళ్లిని గ్రాండ్ గా జరిపించడాన్ని, ఎక్కువ కట్నం ఇవ్వడాన్ని కొందరు స్టేటస్ గా ఫీల్ అవుతారు. ఎంత ఎక్కువ కట్నం ఇస్తే వారు అంత గొప్పగా భావిస్తారు.

తమ గురించి పది మంది చెప్పుకోవాలని తహతహలాడతారు. అందుకే ఖర్చు విషయంలో ఎక్కడా  ఆలోచన చేయరు, వెనక్కి తగ్గరు. అయితే అందరూ అలానే ఉంటారనుకుంటే పొరపాటే. అక్కడక్కడ కొందరు మంచి వాళ్లూ ఉంటారు. వారు తమ కోసం కాకుండా తోటి వారి కోసం బతుకుతారు. పది మందికి పనికొచ్చే పని చేస్తారు. ఇతరులకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తారు. ఆ వధువు ఈ కోవకే వస్తుంది. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా.. రూ.75లక్షల కట్నానికి బదులుగా.. ఆ డబ్బుతో బాలికల హాస్టల్ నిర్మించాలని కోరింది.

రాజ‌స్తాన్‌కు చెందిన ఓ జంట‌కు ఇటీవ‌లే పెళ్లి జ‌రిగింది. పెళ్లి క‌ట్నం కింద ఇచ్చే డ‌బ్బులు త‌మ‌కు వ‌ద్ద‌ని, ఆ డ‌బ్బుతో బాలిక‌ల కోసం హ‌స్ట‌ల్ క‌ట్టించాల‌ని వధువు కోరింది. ఆమె కోరిక‌ విని ముందు ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తేరుకుని కూతురిని మెచ్చుకున్నాడు. ఆమె కోరిక తీర్చేందుకు ఒప్పుకున్నాడు.

Chrome Password Checker : మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్ల చేతుల్లో.. అయితే డౌటే.. ఇలా చెక్ చేసుకోండి!

రూ.75 ల‌క్ష‌లు క‌ట్నం కింద ఇవ్వాల‌ని ముందుగా నిర్ణ‌యించుకున్నా, వధువు కోరిక మేర‌కు హాస్ట‌ల్ కోసం కోటి రూపాయ‌లు వెచ్చించేందుకు సిద్ధమయ్యాడు ఆమె తండ్రి. అవ‌స‌ర‌మైతే మ‌రో రూ.50 నుంచి రూ. 75 ల‌క్ష‌లు అద‌నంగా వెచ్చిందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపాడు. దీనికి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆ వధువు పేరు అంజలి కన్వర్. ఆమె తండ్రి పేరు కిషోర్ సింగ్ కనోడ్. బార్మర్ సిటీలో నివాసం ఉంటారు. అంజలి కన్వర్ ప్రవీణ్ సింగ్ ను నవంబర్ 21న పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు అంజలి తన తండ్రిని కలిసింది. తన కట్నంగా ఇవ్వాలని అనుకున్న రూ.75లక్షలను బాలికల హాస్టల్ నిర్మించేందుకు వెచ్చించాలని కోరింది. అందుకు ఆ తండ్రి వెంటనే ఒప్పకున్నాడు. తన కూతురి కోరిక మేరకు రూ.75లక్షలు హాస్టల్ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చాడు.

తారాతార మఠాధిపతి మహంత్ ప్రతాప్ పూరీ వధువుని ప్రశంసించారు. మంచి పని చేశావని మెచ్చుకున్నారు. సమాజ శ్రేయస్సు కోసం, బాలికల విద్య కోసం డబ్బు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకోవడం స్ఫూర్తిదాయకమైన చర్య అన్నారు. కాగా వధువు తండ్రి ఇప్పటికే హాస్టల్ నిర్మాణం కోసం కోటి రూపాయలు ఇచ్చారు. అయితే మరో రూ.50 లక్షల నుంచి రూ.75లక్షలు అవసరం అవుతాయని చెప్పగా, ఆ డబ్బు కూడా తానే ఇస్తానని వధువు తండ్రి చెప్పారు.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ఎందుకంటే?

బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఆ వధువు చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ అని, హ్యాట్సాఫ్ అని కితాబిస్తున్నారు. ప్రస్తుతం తను సృష్టించిన డబ్బు చుట్టూనే మనిషి తిరుగుతున్నాడు. డబ్బు కోసం దిగజారిపోతున్నాడు. దారుణాలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. కాసుల కక్కుర్తితో అయిన వారిని కడతేర్చేందుకు కూడా వెనుకాడటం లేదు. డబ్బు కోసం మోసాలకు, నేరాలకు, ఘోరాలకు పాల్పడుతున్నారు. డబ్బే లోకం అని బతికేవాళ్లూ ఉన్నారు. పైసామే పరమాత్మ అనే జనాలున్న ఈ రోజుల్లోనూ ఓ మంచి పని కోసం డబ్బుని ఖర్చు చేయడం గొప్ప విషయమే మరి.