Insulted Hindus again: మాంసం తిని గుడికి వెళ్లడంపై సిద్ధూని టార్గెట్ చేసిన బీజేపీ

నలిన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మధ్యాహ్నం మాంసాహారం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటని సిద్ధరామయ్య అంటున్నారు. ఇది మరోసారి హిందువుల మనోభావాలపై విరుచుకుపడటమే. దేవాలయాలపై హిందువులకు ఉన్న మనోభావాలను అర్థం చేసుకోని వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇలాంటి వ్యక్తులకు ఎన్నికలు సమీపిస్తుంటే గుళ్లకు, మఠాలకు వెళ్లే డ్రామాలు ఎందుకో?’’ అని ట్వీట్ చేశారు.

Insulted Hindus again: మాంసం తిని గుడికి వెళ్లడంపై సిద్ధూని టార్గెట్ చేసిన బీజేపీ

Insulted Hindus again says BJP on Siddaramaiah

Insulted Hindus again: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి హిందువుల విశ్వాసాలను దెబ్బతీశారని కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధినేత నలిన్ కుమార్ కటీల్ విమర్శించారు. మధ్యాహ్నం మాంసం తిని సాయంత్రం గుడికి వెళ్లడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సోమవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ సిద్ధరమాయ్యకు ప్రజలే బుద్ధి చెప్తారని నలిన్ కుమార్ మండిపడ్డారు.

సిద్ధరామయ్య ఆలయడానికి వచ్చే ముందు మాంసాహారం తిన్నారని నలిన్ కుమార్ విమర్శలు చేయగా.. ఈ వ్యాఖ్యల్ని సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ‘‘నేను మధ్యాహ్నం మాంసం తిన్నాను. సాయంత్రం గుడికి వెళ్లాను. ఇందులో తప్పేంటో నాకర్థం కావడం లేదు?’’ అని ప్రశ్నించారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో దుమారం లేసింది. ఈ విషయమై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా.. వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయని, వాటిని గౌరవించాలని కాంగ్రెస్ తిప్పి కొడుతోంది.

అయితే నలిన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మధ్యాహ్నం మాంసాహారం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటని సిద్ధరామయ్య అంటున్నారు. ఇది మరోసారి హిందువుల మనోభావాలపై విరుచుకుపడటమే. దేవాలయాలపై హిందువులకు ఉన్న మనోభావాలను అర్థం చేసుకోని వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇలాంటి వ్యక్తులకు ఎన్నికలు సమీపిస్తుంటే గుళ్లకు, మఠాలకు వెళ్లే డ్రామాలు ఎందుకో?’’ అని ట్వీట్ చేశారు.

కాగా, దీనికి ముందు సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడుతూ ‘‘నేను 2:30 నిమిషాలకు సుదర్శన్ గెస్ట్ హైస్‭లో భోజనం చేశాను. సాయంత్రం చాలా సేపటికి గుడికి వెళ్లి పూజ చేశాను. ఈ ఆహారమే తిని గుడికి రావాలని దేవుడేమైనా షరతులు పెట్టాడా? ప్రజలు రాత్రి మాంసం తిని ఉదయమే గుడికి వెళ్తారు. మరి మధ్యాహ్నం మాసం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటి?’’ అని ప్రశ్నించారు.

Congress: ఒకవేళ రాహుల్ కాకపోతే, చాలా మంది.. : అధ్యక్ష పదవిపై గెహ్లోత్