నిఘావర్గాల వార్నింగ్ : పుల్వామా తరహా దాడికి కుట్ర

కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నారా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. పుల్వామా తరహా

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 10:55 AM IST
నిఘావర్గాల వార్నింగ్ : పుల్వామా తరహా దాడికి కుట్ర

కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నారా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్.. పుల్వామా తరహా

కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో ఆత్మాహుతి దాడికి కుట్ర పన్నారా? అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. కశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాద సంస్థ జైషే  మహమ్మద్.. పుల్వామా తరహా ఆత్మాహుతి దాడికి యత్నిస్తుందని భద్రతా బలగాలకు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆత్మాహుతి  దాడుల యత్నాలకు సంబంధించిన వీడియోలను నిఘా వర్గాలు సోషల్ మీడియాలో గుర్తించాయి. 200 కిలోల సామర్థ్యం కలిగిన బాంబులతో  దాడులకు తెగబడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. జమ్మూకాశ్మీర్ లో హైఅలర్ట్ ప్రకటించి  భద్రతను కట్టుదిట్టం చేశాయి.

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక వీడియోని సోషల్ మీడియాలో ఐబీ వర్గాలు గుర్తించాయి. ‘ప్రధానంగా మీకు, మాకే యుద్ధం.. కశ్మీర్ లో అమాయకులను చంపకండి’.. అని ఆ వీడియోలో తీవ్ర హెచ్చరికలు చేయడం ఉంది. పుల్వామా దాడిలో వాడిన బాంబుల కన్నా ఎక్కువ మోతాదులో బాంబులను సమకూర్చుకుని ఈసారి దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. జైషే మహమ్మద్ సంస్థ మద్దతుదారులు ఈ వీడియోని షేర్  చేశారు. దీన్ని గుర్తించిన ఐబీ.. వెంటనే భద్రతా బలగాలను అలర్ట్ చేసింది. ఏ క్షణమైనా పుల్వామా తరహా ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం  ఉందన్నారు. ఎన్నికల సమయం కావడంతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉందని ఐబీ హెచ్చరించింది.