Gautam Gambhir: చంపేద్దామనుకుంటున్నాం… గంభీర్‌కు ఐసిస్ రెండో హెచ్చరిక

బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తానంటూ రెండోసారి ఈమెయిల్ అందిందని సాయం కావాలని విన్నవించారు. ఈ-మెయిల్ ఐడీ isiskashmir@gmail.com నుంచి తనకు అందిన మెయిల్ లో

Gautam Gambhir: చంపేద్దామనుకుంటున్నాం… గంభీర్‌కు ఐసిస్ రెండో హెచ్చరిక

Gautam Gambhir: బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పోలీసులను ఆశ్రయించారు. తనను చంపేస్తానంటూ రెండోసారి ఈమెయిల్ అందిందని సాయం కావాలని విన్నవించారు. ఈ-మెయిల్ ఐడీ isiskashmir@gmail.com నుంచి తనకు అందిన మెయిల్ లో.. ‘మేం నిన్ను చంపేయాలని ప్లాన్ చేశాం. కానీ, నిన్న నువ్వు బతికిపోయావ్. కుటుంబంతో కలసి గడపాలనుకుంటే రాజకీయాలకు, కశ్మీర్ అంశానికి దూరంగా ఉండు’ అని అందులో ఉంది.

సెకండ్ ఈమెయిల్ లో ఢిల్లీలోని గౌతం గంభీర్ ఇంటి బయటి వాతావరణం అంతా షూట్ చేసిన వీడియో పంపారు. ఐసిస్ కశ్మీర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తొలి మెయిల్ లో నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారంటూ ఫిర్యాదు చేశాడు. ఎంపీ పర్సనల్ సెక్రటరీ గౌరవ్ అరోరా తెలిపిన వివరాలను బట్టి ఎఫ్ఐఆర్ లో రిజిష్టర్ చేశారు.

మంగళవారం రాత్రి 9గంటల 32నిమిషాలకు తొలి మెయిల్ రాగా బుధవారం రెండో మెయిల్ వచ్చింది. ఈమెయిల్ అడ్రస్ ను సెంట్రల్ డిస్ట్రిక్ట్ సైబర్ సెల్ తనిఖీ చేస్తుందని.. అధికారులు చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఎంపీ ఇంటి బయట సెక్యూరిటీని చెక్ చేశామని ధైర్యం చెప్పారు.

………………………………. : స్పెయిన్‌లో చిల్ అవుతున్న నిహారిక కపుల్..