EPF Interest : ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) చందాదారులకు గుడ్ న్యూస్. చందాదారుల ఖాతాల్లో త్వరలో ఈపీఎఫ్ వడ్డీ జమ కానుంది.

EPF Interest : ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త

Epf

EPF Interest credit : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) చందాదారులకు గుడ్ న్యూస్. చందాదారుల ఖాతాల్లో త్వరలో ఈపీఎఫ్ వడ్డీ జమ కానుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలో సుమారు 6 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఈపీఎఫ్ వడ్డీని జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక ఖాతాదారుడు ట్విటర్ లో అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది.

“ఈ ప్రక్రియ పైప్ లైన్ లో ఉంది. అతి త్వరలో మీ ఖాతాలో చూపించవచ్చు. ఇప్పటి వరకు పొగుచేసిన వడ్డీ పూర్తిగా జమ చేయనున్నారు. వడ్డీలో ఎలాంటి నష్టం ఉండదు. దయచేసి సహనాన్ని పాటించండి”‎ అని ట్వీట్ చేసింది.

రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ ఈ నెలాఖరు నాటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని జమ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియ ఇంకా పైప్ లైన్ లో ఉంది. ఈపిఎఫ్ చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వారి ఖాతాలో ఈ నెలలో ఏదో ఒక రోజు క్రెడిట్ చేసే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌ లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?
చందాదారులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయాలి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.