గుడ్ న్యూస్ : వడ్డీ ఆదాయంపై పన్ను పరిమితి పెంపు

  • Published By: venkaiahnaidu ,Published On : February 1, 2019 / 07:55 AM IST
గుడ్ న్యూస్ : వడ్డీ ఆదాయంపై పన్ను పరిమితి పెంపు

పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై వచ్చే ఆదాయంపై TDS(టీడీఎస్) పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ఆదాయ పన్ను పరిమితి ప్రస్తుతం రూ.10వేలుగా ఉంది. పోస్టల్, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం 10వేల రూపాయలు దాటితే.. పన్ను చెల్లించాల్సి వచ్చేంది. ఈ పరిమితిని  రూ.40వేలకు పెంచుతున్నట్లు బడ్జెట్ లో ప్రకటించింది ప్రభుత్వం.

 

సీనియర్ సిటిజన్లు, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో వడ్డీని పొందుతుంటారు. వడ్డీ ఆదాయం ద్వారానే అవసరాలు తీర్చుకుంటుూ ఉంటారు. వడ్డీ ఆదాయం 10వేల రూపాయలు దాటితే పన్ను చెల్లింపును తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీన్ని గమనించిన కేంద్రం.. ఈసారి భారీ ఊరట ఇచ్చింది. పన్ను పరిమితిని 40వేల రూపాయలకు పెంచింది. దీని వల్ల సీనియర్ సిటిజన్లు, గ్రామీణ మధ్య తరగతి ప్రజలకు లబ్ది చేకూరనుంది. బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లలో, పోస్ట్ ఆఫీస్ లోని వివిధ స్కీమ్స్ లో  డిపాజిట్లు పెరగనున్నాయి.