క్యూట్ క్యాట్స్ : ఢిల్లీలో ఇంటర్నేషనల్ పిల్లుల ఫెస్టివల్

క్యూట్ క్యాట్స్ : ఢిల్లీలో ఇంటర్నేషనల్ పిల్లుల ఫెస్టివల్

ఢిల్లీలో అంతర్జాతీయ పిల్లుల ఫెస్టివల్ ఎంతో ఆహ్లాదంగా జరిగింది. భారత్‌లోనే అతి పెద్దగా జరిగిన ఈ వేడుకకు పిల్లి ప్రేమికులు హాజరయ్యారు. తమ పిల్లులను అందంగా ముస్తాబు చేసి తీసుకొచ్చారు. అలాగే, పోలీసు డాగ్స్ కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

‘ఇంటర్నేషనల్ క్యాట్ ఫెస్టివల్’పేరుతో ఈ క్యాట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఫెస్టివల్ కు తమ పెంపుడు పిల్లులను తీసుకొచ్చిన యజమానులు వాటిని చక్కగా అలంకరించారు. చిట్టి చిట్టి..క్యూట్ క్యూట్  పిల్లులతో పాటు ఒంటినిండా బొచ్చుతో పులి పిల్లలను తలపించేలా ఉండే పిల్లులు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. యజమానులు తమ పిల్లులను చూసుకుని మురిసిపోయారు. ఈ ఫెస్టివల్ లో మీమో అనే పిల్లి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మీయోను చూసినవారంతా చక్కగా ఫోటోలు తీసుకున్నారు. సెల్ఫీలు తీసుకున్నారు. ఫోటోలకు మీమో చక్కగా ఫోజులు కూడా ఇచ్చింది.