నేపాలీల కోసం…అంతర్జాతీయ నిషేధ ‘బ్రిడ్జి’ పునఃప్రారంభం

  • Published By: venkaiahnaidu ,Published On : October 22, 2020 / 04:53 PM IST
నేపాలీల కోసం…అంతర్జాతీయ నిషేధ ‘బ్రిడ్జి’ పునఃప్రారంభం

Dharchula Bridge:అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్​లోని ప్రముఖ థార్చులా బ్రిడ్జ్​ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. గతంలో భారత ఆర్మీ,ఇతర విభాగాలలో పనిచేసి రిటైర్ట్ అయిన నేపాలీ సిటిజన్లు తమ పెన్షన్ సొమ్మును విత్​ డ్రా చేసుకునేందుకు…నేపాల్ అభ్యర్థన మేరకు థార్చులాలోని బ్రిడ్జిని మూడు రోజుల పాటు రీఓపెన్ చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.



బుధవారం నుంచి శుక్రవారం(అక్టోబర్-23) వరకు నిర్ణీత కాలవ్యవధిలోనే..రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రిడ్జ్​ ద్వారా రాకపోకలకు అనుమతి కల్పించారు అధికారులు.



https://10tv.in/prabhas-to-vijay-5-south-indian-celebs-who-made-more-money-than-bollywood-stars/
2 గంటల తర్వాత బ్రిడ్జ్​ను మూసివేయబడుతుందని థార్చులా తహసీల్దార్ మోహన్ గోస్వామి​ తెలిపారు. బుధవారం 239 మంది నేపాలీయులు ఈ బ్రిడ్జ్ గుండా మన దేశంలోకి వచ్చారు. అలాగే 151 మంది భారతీయులు నేపాల్ వెళ్లారు.

కాగా, నేపాల్​ అభ్యర్థన మేరకు.. పింఛన్​ దార్ల సౌకర్యార్థం ప్రతి నెలా ఈ సదుపాయం కల్పిస్తామని థార్చులా డిప్యూటీ కలెక్టర్​ అనిల్​ కుమార్​ శుక్లా తెలిపారు.