Shantanu Deshpande: కొత్త ఉద్యోగులు రోజుకు 18 గంటలు పనిచేయాలన్న సీఈవో.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

యువకులు ఉద్యోగంలో చేరిన వెంటనే కనీసం నాలుగైదేళ్లపాటు రోజుకు 18 గంటలు పని చేయాలని సూచించాడు ఒక కంపెనీ సీఈవో. దీంతో అతడిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఉద్యోగుల్ని ఇలాంటివాళ్లు బానిసలుగా చూస్తున్నారని విమర్శిస్తున్నారు.

Shantanu Deshpande: కొత్త ఉద్యోగులు రోజుకు 18 గంటలు పనిచేయాలన్న సీఈవో.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

Shantanu Deshpande: యువకులు.. కొత్తగా ఉద్యోగంలో చేరితే, నాలుగైదేళ్లపాటు రోజుకు 18 గంటలు పనిచేయాలని సలహా ఇచ్చాడు ఒక కంపెనీ సీఈవో. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాంబే షేవింగ్ కంపెనీ ఫౌండర్ సీఈవో శంతను దేశ్‌పాండే అనే వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు.

Viral Video: ఆటోపైకెక్కి స్కూల్‌కెళ్తున్న విద్యార్థులు.. జారిపడితే అంతే! కేసు నమోదు.. వీడియో వైరల్

అందులో ఉద్యోగులు ఎలా పనిచేయాలో సూచించాడు. ‘‘మీరు 22 ఏళ్ల వయసులో కొత్తగా ఉద్యోగంలో చేరినట్లైతే.. అందులోకి దూరిపోవాలి. సరిగ్గా తింటూ ఫిట్‌గా ఉండాలి. కనీసం నాలుగైదేళ్లపాటు రోజుకు 18 గంటలు పనిచేయాలి. చాలా మంది యువత సోషల్ మీడియాలో ఏదో కంటెంట్‌ను ర్యాండమ్‌గా చూస్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, కుటుంబంతో గడపడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ముఖ్యమే కాని. అంత తక్కువ సమయంలో కాదు. కెరీర్ మొదట్లో పనే దైవం. ఎంత కష్టమైనా కావొచ్చు.. కెరీర్ మొదటి ఐదేళ్లలో నిర్మించుకున్న అంశాలే మిగతా కెరీర్‌కు ఉపయోగపడతాయి’’ అని శంతన్ పాండే రాసుకొచ్చారు. అయితే, దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Lehenga Buttons: మామూలు తెలివి కాదు.. లెహెంగా బటన్స్‌లో 41 లక్షల క్యాష్.. పట్టుకున్న అధికారులు

ఇలాంటి వాళ్ల వల్లే ఇంకో తరం ప్రజల్ని బానిసలుగా తయారు చేసి, దేశ్‌పాండే లాంటి వ్యక్తుల్ని ధనవంతులుగా మారుస్తున్నామని ఒక నెటిజన్ అన్నారు. మరో నెటిజన్ అయితే.. రోజుకు 4-5 గంటలు పని మాత్రమే చాలన్నారు. చాలా మంది శంతన్ పాండే లాగే హానికరమైన వర్కింగ్ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని ఇంకొందరు విమర్శిస్తున్నారు.