ఎస్బీఐ సేవలకు అంతరాయం

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ముఖ్య గమనిక చేసింది. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన ఉద్యోగ సంఘాలు మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సమ్మె కారణంగా ఆ రెండు రోజులూ సాధారణ బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఎస్బీఐ తెలిపింది.

ఎస్బీఐ సేవలకు అంతరాయం

interruption in sbi bank services: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ముఖ్య గమనిక చేసింది. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన ఉద్యోగ సంఘాలు మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సమ్మె కారణంగా ఆ రెండు రోజులూ సాధారణ బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఎస్బీఐ తెలిపింది.

బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయంతో పాటు, తిరోగమన బాటలో ఉన్న బ్యాంకింగ్‌ సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక ట్విట్టర్‌లో ప్రకటించింది. బ్యాంకు శాఖల్లో కార్యకలాపాలు కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది.

కాగా, బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వచ్చే వారం పది రోజుల్లో బ్యాంకులు ఎక్కువ రోజులు క్లోజ్‌లోనే ఉండనున్నాయి. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో తెలుసుకోవాలి. రేపు(మార్చి 11,2021) శివరాత్రి సందర్భంగా బ్యాంకులు పని చేయవు. శుక్రవారం(మార్చి 12,2021) ఒక్క రోజు బ్యాంకులు పని చేస్తాయి. ఆ తర్వాత శనివారం(మార్చి 13), ఆదివారం(మార్చి 14) రెండు రోజులు బ్యాంకులు పని చేయవు. రెండో శనివారం కారణంగా బ్యాంకులు క్లోజ్. ఇక ఆదివారం బ్యాంకులు ఎలాగూ పని చేయవు. అంటే బ్యాంకులు వరుసగా రెండు రోజులు పనిచేయవు.

ఆ తర్వాత సోమవారం(మార్చి 15), మంగళవారం(మార్చి 16) కూడా బ్యాంకులు పని చేసే ఛాన్స్ లేదని చెప్పుకోవాలి. దీనికి కారణం బ్యాంకు యూనియన్ల సమ్మె. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఈ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె బాట పట్టారు. సో, శుక్రవారం(మార్చి 12,2021) ఒక్క రోజు మినహాయిస్తే.. బ్యాంకులు 5 రోజులు పని చేయవని చెప్పుకోవచ్చు.