Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ.. వ్యతిరేకించిన సీబీఐ
సిసోడియా బెయిల్ పిటిషన్ విషయంలో సిసోడియా తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాదులు అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టును కోరారు. అయితే, దీన్ని సీబీఐ వ్యతిరేకించింది. అతడికి బెయిల్ ఇవ్వొద్దని కోరింది.

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ కొనసాగింది. సిసోడియా తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాదులు అతడికి బెయిల్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ కోర్టును కోరారు.
‘‘ఫోన్ల అప్ గ్రేడ్ కోసమే సిసోడియా పాత ఫోన్లను ధ్వంసం చేశారు. సిసోడియాకు ఫ్లైట్ రిస్క్ లేదు. అతడి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సిసోడియా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదు. సిసోడియా ముడుపులు తీసుకున్నట్లుగా ఆధారాలు కూడా లేవు’’ అని సిసోడియా న్యాయవాదులు అన్నారు. అయితే, సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. ‘‘ఈ కేసులో చార్జిషీట్ ఫైల్ చేయడానికి 60 రోజుల సమయం ఉంది. సిసోడియా సాక్షులను ప్రభావితం చేయగల వ్యక్తి. సిసోడియా యాపిల్ ఫోన్ వాడుతున్నారు. మూడు నెలల్లో కొత్త ఫోన్‌కి ఎలా మారుతారు. సిసోడియాకి వ్యతిరేకంగా కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. సిసోడియా సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల ముడుపులు తీసుకున్నారు.
Chinkara: జింక మాంసం వండుకుతిన్న వేటగాళ్లు.. బిష్ణోయ్ వర్గం ఆగ్రహం
సౌత్ గ్రూప్ ఒబారాయ్ హోటల్లో బస చేశారు. సిసోడియా కంప్యూటర్ నుంచే లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ కాపీ ప్రింట్ అవుట్ తీశారు. పాలసీలో తమకి అనుకూలంగా చేయాల్సిన మార్పులపై చర్చించారు. 36 పేజీల డ్రాఫ్ట్ పాలసీ ఫోటో కాపీ తీశారు. లిక్కర్ పాలసీ కాపీ విజయ్ నాయర్‌కి చేరింది. కోవిడ్ సమయంలో స్పెషల్ ఫ్లైట్‌లో సౌత్ గ్రూప్ ఢిల్లీ వచ్చింది. సౌత్ గ్రూప్ సూచనలను సిసోడియా పరిగణనలోకి తీసుకున్నారు. డీలర్ కమిషన్ 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారు.
బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సమీర్ మహేంద్రు కంపెనీకి లిక్కర్ నూతన పాలసీలో అవకాశం కల్పించారు. ఈ కంపెనీని నూతన పాలసీలో చేర్చాలని సిసోడియా ఒత్తిడి తెచ్చారు. చివరకు అన్ని నిబంధనలకు విరుద్ధంగా వారికి లైసెన్స్‌లు ఇచ్చారు’’ అని సీబీఐ వాదించింది. అయితే, సీబీఐ వాదనలకు, బెయిల్‌కు సంబంధం లేదని సిసోడియా తరఫు న్యాయవాది అన్నారు.