న్యాయ వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉంది: సీజేఐ రంజన్ గొగోయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

  • Published By: veegamteam ,Published On : April 20, 2019 / 07:03 AM IST
న్యాయ వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉంది: సీజేఐ రంజన్ గొగోయ్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 20 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తున్న తనపై లైంగిక ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. సీజేఐగా తనను తొలగించడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రకు ప్రమాదం పొంచి ఉందన్నారు. తన అకౌంట్ లో రూ.6.8 లక్షలు ఉన్నాయని, తనకంటే తన ప్యూన్ దగ్గర అంతకంటే ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నారు. 20ఏళ్ల తన సర్వీసులో తనకు ఇచ్చే బహుమానం ఇదేనా? అంటూ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

గొగోయ్ పై వచ్చిన ఆరోపణలను మరో సీనియర్ న్యాయమూర్తి పరిశీలనకు పంపుతామన్నారు. గొగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చీఫ్ సస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జిస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 

మరోవైపు మీడియా కథనాల ఆధారంగా ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. ఆరోపణలను ప్రచురించిన మీడియా సంస్థల స్వతంత్రతకే వదిలేస్తున్నామని తెలిపారు. సీజేఐపై వచ్చిన ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఇది విచారణ అని మనం భావించలేమని.. ఎందుకంటే ఎవరు కూడా పిటిషన్ వేయలేదని.. ఎవరూ వాదనలు జరుగలేదని తెలిపింది. రంజన్ గొగోయ్ పై వచ్చిన ఆరోపణలు, మీడియాలో వస్తున్న కథనాలపై సుప్రీంకోర్టులో కీలకమైన చర్చ జరిగింది. 

ఈరోజు సెలవు దినం అయినప్పటికీ ఈ ధర్మాసనం ప్రత్యేకంగా భేటీ అయింది. ప్రభుత్వ సొలిసెటరీ జనరల్ తుషార్ మెహతా ఈ వాదనలు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టులో గతంలో అసిస్టెంట్ గా పని చేసిన 30 ఏళ్ల మాజీ ఉద్యోగిని సీజేఐపై ఆరోపణలు చేసింది. గత కొన్నేళ్లుగా తమ కుటుంబం వేదనకు గురవుతుందని..అందుకు సీజేఐ రంజన్ గొగోయ్ కారమణని ఆమె ఆరోపణలు చేసింది. అయితే ఇది పూర్తిగా నిరాధారమని… ఆ మహిళపై రెండు ఎఫ్ ఐఆర్ లు, కేసులున్నాయని చెబుతున్నారు. 

అవినీతి, లంచం తీసుకున్నారనే ఆరోపణలు సదరు మహిళపై ఉన్నాయని తెలుస్తోంది. మహిళ కుటుంబ సభ్యులు ఢిల్లీ పోలీసు విభాగంలో పని చేస్తున్నారు. వారిపై కూడా కొన్ని ఆరోపణలుండటంతో వారి ఉద్యోగాలు తొలగించారు. ఇటీవలే ఆమె కుంటుబానికి చెందిన ఒక వ్యక్తిని సుప్రీంకోర్టులో ఉద్యోగిగా చేర్పించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తర్వాత అతన్ని తొలగించారు. మహిళ చేసిన లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ పూర్తిగా ఖండించారు. మీడియాకు వివరణ కూడా ఇచ్చారు.