ముంబై ఎయిర్ పోర్టు స్కామ్ లో సోదాలు… ఏకకాలంలో 9 చోట్ల తనిఖీలు

  • Published By: bheemraj ,Published On : July 28, 2020 / 03:37 PM IST
ముంబై ఎయిర్ పోర్టు స్కామ్ లో సోదాలు… ఏకకాలంలో 9 చోట్ల తనిఖీలు

mumbai-airport

ముంబై ఎయిర్ పోర్టు స్కామ్ లో ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. ముంబై, హైదరాబాద్ సహా 9 చోట్ల ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జీవీకేపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేస్తోంది. ముంబై అభివృద్ధి నిధుల్లో అవినీతిపై జీవీకే గ్రూప్ చీఫ్ సహా 9 కంపెనీలు, పలువురు అధికారులపైన సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.705 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు జీవీకే సంజయ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. బోగస్ పనులు సృష్టించించి 2017-18 వాటి కాంట్రాక్టులను 9 కంపెనీలకు కట్టబెట్టి పూర్తి చేసినట్లు చూపి రూ.310 కోట్ల నష్టం కలిగించారని సీఐబీ అధికారులు చెతున్నారు.

మరో 395 కోట్ల జాయింట్ వెంచర్ రిజర్వ్ ను నిధులను జీవీకే కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు మళ్లించినట్లు సీబీఐ గుర్తించారు. జాయింట్ వెంచర్ తో సంబంధం లేని వెంచర్లు నిధులు చెల్లించారని దీంతో ఏఏఐకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. బోగస్ పనులు సృష్టించి 2017-18 లో వాటి కాంట్రక్టులను 9 కంపెనీలకు కట్టబెట్టి పూర్తి చేసినట్లు చూపి 310 కోట్ల రూపాయలను నష్టం కలిగించారని సీబీఐ చెబుతోంది. ముంబై ఎయిర్ పోర్టు అమిటెడ్ సిబ్బందికి చెల్లింపులను కూడా భారీగా పెంచి చూపించారని ఆరోపణలు ఉన్నాయి.

ముంబై ఎయిర్ స్కాంకు సంబధించి సీబీఐ ఇచ్చిన రిపోర్టు ఆదారంగా ఈ రోజు జీవీకే సంస్థలపై ఏకకాలంలో 9 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో మూడు ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. జీవీకే ప్రధాన కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. ఇందులో ఉదయం నుంచి ఏక కాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.

జీవీకే ప్రధాన కార్యాలయంతోపాటు తన నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఈడీ ముంబై తర్వాత హైదరాబాద్ లలో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తోంది.
అయితే ముంబై ఎయిర్ పోర్టుకు సంబంధించి 2006లో ఎయిర్ పోర్టు అథారిటీతో కుదుర్చుకున్న జీవీకే ప్రాజెక్టులో అవకతవకలు జరుగడంతోపాటు వాటికి వాటి పేరుతో నిధులను మళ్లింపు, బోగస్ కంపెనీలు ఏర్పాటు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి 700 కోట్ల రూపాయల వరకు నష్టం కలిగించారని సీబీఐ అభియోగం మోపింది.

2017-18 కు సంబంధించి కాంట్రాక్టుల ద్వారా రూ.310 కోట్ల మేర స్వంత సంస్థలకు రుణాల పేరు మీద మళ్లింపు జరిగిందని విచారణలో వెల్లడవుతోంది. 395 కోట్ల రూపాయలకు సంబంధించి జీవీకే నిధులు మళ్లించినట్లు సీబీఐ ఇచ్చినటువంటి రిపోర్టు. వీటన్నిటి ఆధారంగా ఏ ఏ సంస్థలకు ఎన్ని మల్లాయో అన్న కోణంలో ఉదయం ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. హైదరాబాద్ లోని మూడు చోట్లకు సంబంధించి సోదాలు కొనసాగిస్తున్నాయి. నిధులకు సంబంధించి ఫ్రాడ్ జరుగడంతోపాటు జీవీకే అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్ వెంచర్ ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధ మియాల్ తో ఒప్పందం చేసుకున్నారు.

ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ.310 కోట్లను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన తనయుడు సంజయ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది.