చిదంబరం అరెస్ట్…గుడ్ న్యూస్

  • Published By: venkaiahnaidu ,Published On : August 29, 2019 / 10:52 AM IST
చిదంబరం అరెస్ట్…గుడ్ న్యూస్

INX మీడియా కేసులో ఇటీవల అఫ్రూవర్ గా మారిపోయిన ఇంద్రాణి ముఖర్జీ…ఈ కేసులో  చిదంబరం అరెస్ట్ పై స్పందించారు. చిందరం అరెస్ట్…గుడ్ న్యూస్ అన్నారు. కూతురు షీనా బోరాని హత్య చేసిన కేసులో ఆమెను ఇవాళ(ఆగస్టు-29,2019)ముంబై సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ… చిదంబరం అరెస్ట్‌ను శుభపరిణామంగా అభివర్ణించింది. ఐఎన్ఎక్స్ మీడీయా మాజీ ప్రమోటర్‌ అయినా ఇద్రాణి ముఖర్జికి చిదంబరంపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్నట్టుంది. అందుకే ఆయన అరెస్ట్ ను ఆమె గుడ్ న్యూస్ అనింది. అంతకు ముందు ఐఎన్ఎక్స్ కేసులో ఇంద్రాణి ముఖర్జితోపాటు ఆమే భర్త పీటర్ ముఖర్జీలు కూడ అరెస్ట్ అయి అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.

INX మీడియా లో విదేశీ పెట్టుబడుల విషయంలో ఎఫ్ఐపీబీ నిబంధనలు ఉల్లంఘించి చిదంబరం తమకు సహకరించాడని ఇంద్రాణీ తెలిపిన విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కాంలో ఆమె, ఆమె రెండో భర్త పీటర్‌ ముఖర్జీ సహ నిందితులు. ఆ మీడియా సంస్థ పెట్టింది ఇంద్రాణీయే. వీరు మీడియా లాబీయిస్టులు. ఇందులో పీటర్‌ .. చిదంబరం కుమారుడు కార్తికి వ్యాపార సలహాదారు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంద్రాణీ ఐఎన్‌ఎక్స్‌ లో 26 శాతం వాటా అమ్మకానికి అనుమతి కోరారు. కానీ ఎఫ్‌ఐపీబీ తొలుత ఆమె దరఖాస్తును తిరస్కరించింది. చిదంబరం కూడా రూ 4.62 కోట్ల మేర వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు.

ఆ సమయంలో కార్తి ఓ బేరం పెట్టారు. విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఈ డీల్‌ కుదరుస్తానన్నది ఆ ప్రతిపాదన. ఇందుకు పీటర్‌ ఒప్పుకున్నారు. మనీ లాండరింగ్‌ ద్వారా ఎంత మొత్తాన్ని తరలించిందన్నది ఇంద్రాణీ వెల్లడించకపోయినా దాదాపు రూ. 300 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. తర్వాత కార్తిని ఇంద్రాణీ ఓ స్టార్‌ హోటల్లో కలిసి 10 లక్షల డాలర్ల మేర చెల్లించడానికి చర్చలు జరిపారు. చివరకు రూ 3.5 కోట్ల చెల్లింపుకు ఒప్పందం కుదిరింది. ముఖర్జీ దంపతులు ఆ మొత్తాన్ని కార్తి చిదంబరానికి సింగపూర్‌లో ఉన్న సంస్థ అడ్వాంటేజ్‌ సింగపూర్‌కు బదలాయించారు. ఈ వివరాలన్నింటినీ ఇంద్రాణీ సీబీఐ దర్యాప్తులో బయటపెట్టేశారు. అప్రూవర్‌గా మారారు.